Site icon NTV Telugu

Supreme Court: వివేకా హత్య కేసు దర్యాప్తుపై సుప్రీం సీరియస్

Supreme Court

Supreme Court

Supreme Court: వివేకా హత్య కేసు దర్యాప్తు ఆలస్యంపై సుప్రీకోర్టు సీరియస్ అయింది. వివేకా హత్య కేసు విచారణ ఎంతవరకు వచ్చిందో చెప్పాలని సుప్రీంకోర్టు అడిగింది. విచారణపై తాజా పరిస్థితిని సీల్డ్ కవర్ లో కోర్టుకు సమర్పించాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. వివేకా హత్య కేసును ఎందుకు దర్యాప్తు చేయడం లేదని సీబీఐని ప్రశ్నించింది. దర్యాప్తు అధికార ఎందుకు విచారణను జాప్యం చేస్తున్నారని అడిగింది. విచారణ త్వరగా ముగించకపోతే వేరే దర్యాపు అధికారిని ఎందుకు నియమించకూడదని వ్యాఖ్యానించింది.

Read Also: Tapsee: బ్రా లేకుండా దాంతో కవర్ చేసినా.. కనిపించేస్తున్నాయే

దర్యాప్తు అధికారి సమర్ధవంతుడు కాకపోతే ఆయన స్థానంలో వేరొకరిని నియమించడంపై సిబిఐ డైరక్టర్ అభిప్రాయం అడిగి చెప్పాలని సిబిఐ తరపు న్యాయవాది నటరాజన్ ను సుప్రీం ఆదేశించింది. సుప్రీంకోర్టులో వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితుడు శివశంకర్ రెడ్డి భార్య తులశమ్మ వేసిన పిటిషన్ పై విచారణ జరిపింది. వివేకానంద రెడ్డి హత్య కేసులో దర్యాప్తు అధికారి రాంసింగ్ విచారణను జాప్యం చేస్తున్నందున ఆయన్ను మార్చాలని పిటిషన్ లో కోరింది. అయితే దర్యాప్తు అధికారి సక్రమంగానే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని కోర్టుకు సీబీఐ తరుపు న్యాయవాది తెలిపారు. కేసు విచారణను సోమవారానికి వాయిదా వేశారు.

Exit mobile version