Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Supreme Court Expressed Anger At Dog Lovers

Supreme Court: కుక్కల మీద ఉన్న ప్రేమ.. మనుషులపై ఎందుకు లేదు.. జంతు ప్రేమికులకు సూటిప్రశ్న

Published Date :January 13, 2026 , 3:42 pm
By Suresh Maddala
  • జంతు ప్రేమికులపై సుప్రీంకోర్టు ఆగ్రహం
  • కుక్కల మీద ఉన్న ప్రేమ.. మనుషులపై ఎందుకు లేదు
  • ఈసారి ఏదైనా జరిగితే బాధ్యత వహించాలని వార్నింగ్
Supreme Court: కుక్కల మీద ఉన్న ప్రేమ.. మనుషులపై ఎందుకు లేదు.. జంతు ప్రేమికులకు సూటిప్రశ్న
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

వీధి కుక్కల బెడదపై మరోసారి దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది. కుక్కల మీద ఉన్న ప్రేమ.. మనుషులపై ఎందుకు లేదని నిలదీసింది. కుక్కల బెడదపై ఇప్పటికే సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆయా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాల్సిందేనని సూచించారు. తాజాగా మంగళవారం కూడా మరొక సారి సుప్రీం ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా జంతు ప్రేమికులపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇది కూడా చదవండి: Rahul Gandhi: తమిళనాడు ఎన్నికల వేళ ట్విస్ట్.. విజయ్‌కు మద్దతుగా నిలిచిన రాహుల్‌గాంధీ

Also Read

  • CM Vijay: సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. మందుబాబులకు బిగ్ షాక్!
  • Himanta Biswa Sarma: నేడు అస్సాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న హిమంత బిస్వా శర్మ
  • Punjab: బీజేపీలో చేరిన పంజాబ్ సీఎం బంధువు జ్ఞాన్ సింగ్
  • PM Modi: పొదుపుగా జీవించండి.. వడోదరలో పౌరులకు మోడీ పిలుపు
Add as a preferred
source on google

‘మీకు కుక్కల పట్ల మాత్రమే సానుభూతి ఉందా?, మనుషుల పట్ల లేదా?, కుక్కల దాడిలో చిన్న పిల్లలు, వృద్ధులు చచ్చిపోతుంటే బాధ్యత లేదా? బహిరంగ ప్రదేశాల్లో కుక్కలకు ఆహారం పెడతారా?, ఇదేం పద్ధతి? పౌరుడు చనిపోతుంటే.. తీవ్రంగా గాయపడుతుంటే.. మానవత్వం లేదా?, మీకు కరుణ కుక్కల వరకే పరిమితమైందా? మనుషులపై కాదా? 9 ఏళ్ల బాలిక వీధి కుక్కల దాడిలో చనిపోతే ఎవరు బాధ్యత వహిస్తారు? ఇకపై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఆహారం ఇచ్చే వారు కూడా బాధ్యత వహించాల్సిందే.’’ అని జంతు ప్రేమికులకు సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది.

బహిరంగ ప్రదేశాల్లో కుక్కలకు ఆహారం పెట్టే వారిని.. వాటికి మద్దతు ఇచ్చే సంస్థలను జవాబుదారీగా ఎందుకు ఉంచకూడదని న్యాయస్థానం ప్రశ్నించింది. ప్రతి కుక్క కాటుకు.. మరణం లేదా తీవ్రంగా గాయపడితే రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఆయా సంస్థలు బాధ్యత వహించాల్సిందేనని హెచ్చరించింది. ఈ సమస్యను పరిష్కరించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైతే మాత్రం భారీ జరిమానా ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు జస్టిస్ విక్రమ్ నాథ్, సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. కచ్చితంగా బహిరంగ ప్రదేశాల్లో ఆహారం పెట్టే వారిని జవాబుదారీగా ఉంచుతామని ధర్మాసనం తేల్చి చెప్పింది.

ఇది కూడా చదవండి: Pakistan: భారత్ లక్ష్యంగా, పాకిస్తాన్ ఆర్మీ “రాకెట్ ఫోర్స్” ఏర్పాటు..

గతేడాది నవంబర్ 7న సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. విద్యాసంస్థలు, ఆస్పతులు, రైల్వే స్టేషన్లలో కుక్క కాటులపై ఆందోళన వ్యక్తం చేసింది. ఆ ప్రాంతాల్లో కుక్కల బెడద లేకుండా చూడాలని ఆదేశించింది. స్టెరిలైజేషన్, టీకాల తర్వాత షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది. తిరిగి పట్టుకున్న స్థలాల్లో విడిచి పెట్టొద్దని ముగ్గురు న్యాయమూర్తుల ప్రత్యేక ధర్మాసనం పేర్కొంది. అలాగే రాష్ట్ర రహదారులు, జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేల నుంచి అన్ని పశువులు, ఇతర వీధి జంతువులను తొలగించేలా చూడాలని ధర్మాసనం అధికారులను ఆదేశించింది.

అంతేకాకుండా గతేడాది జూలైలో కూడా ఇలాంటి కీలక ఆదేశాలు ఇచ్చింది. ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో వీధి కుక్కలు లేకుండా షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కుక్క కాటు కారణంగా ఒక్క రేబిస్ మరణం జరగకూడదని తెలిపింది. అడ్డుకునేవారిపై కఠిన చర్యలు కూడా తీసుకోవాలని ఆదేశించింది. అలాగే వీధి కుక్కలకు ఆహారం పెట్టడానికి ప్రత్యేక దాణా స్థలాన్ని ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులను కోర్టు ఆదేశించింది. బహిరంగంగా ఆహారం ఇవ్వడానికి అనుమతించబడదని.. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. ఇదే మాదిరిగా ఢిల్లీ హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. అయితే జంతు ప్రేమికులు న్యాయస్థానాల ఆదేశాలపై ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Animals Lovers
  • Dog Lovers
  • Humans
  • Supreme Court
  • Sympathy

తాజావార్తలు

  • Sreeleela: తమిళనాడు కోడలిగా శ్రీలీల..? తాజా కామెంట్స్ హాట్ టాపిక్!

  • Ali : అలీ కీలక పాత్రలో కొత్త సినిమా ప్రారంభం!

  • NBK – Vivek Athreya : వివేక్ ఆత్రేయ సినిమాలో ‘బాలయ్య’ డ్యూయల్ రోల్.. ఊచకోత అన్ లిమిటెడ్

  • CM Vijay: సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. మందుబాబులకు బిగ్ షాక్!

  • Raj Tarun: నిద్రలో నడుస్తూ హత్యలు.. రాజ్ తరుణ్ ‘టార్టాయిస్’ ఫస్ట్ లుక్ రిలీజ్!

ట్రెండింగ్‌

  • Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్‌ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!

  • 204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..

  • Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..

  • 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!

  • PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions