లఖింపూర్ ఖేరీ కేసులో ఆశిష్ మిశ్రాకు బెయిల్‌ను రద్దు చేసింది సుప్రీంకోర్టు… అలహాబాద్ హైకోర్టు ఆశిష్‌మిశ్రాకు బెయిల్ మంజూరు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇదే సమయంలో.. వారం రోజుల్లోగా లొంగిపోవాలని ఆశిష్ మిశ్రాను ఆదేశాలు జారీ చేసింది అత్యున్నత న్యాయస్థానం… అలహాబాద్ హైకోర్టు ఆదేశాలను పక్కన పెడుతూ, లఖింపూర్ ఖేరీ హింసాకాండ నిందితుడు ఆశిష్ మిశ్రాకు మంజూరైన బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది.. కాగా, ఈ కేసులో అలహాబాద్ హైకోర్టు మిశ్రాకు బెయిల్ మంజూరు చేసింది. ఈ అంశాన్ని మళ్లీ విచారించేందుకు అలహాబాద్ హైకోర్టుకు ఈ అంశాన్ని తిరిగి పంపింది సుప్రీంకోర్టు.
Read Also: COVID 19: ఫోర్త్ వేవ్ టెన్షన్..! తెలంగాణ సర్కార్ అలెర్ట్..
కాగా, లఖింపూర్ ఖేరీ హింస కేసులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడైన ఆశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టు ఫిబ్రవరి 10వ తేదీన బెయిల్ మంజూరు చేసింది. అయితే, అలహాబాద్ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ లఖింపూర్ ఖేరీ ఘటనలో మృతుల కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులు చట్టపరంగా సమర్థనీయం కాదని పిటిషనర్ పేర్కొన్నారు. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం నిషేధించబడిన ఉత్తర్వుపై ఎలాంటి అప్పీల్‌కు ప్రాధాన్యత ఇవ్వడంలో విఫలమైనందున తాము సుప్రీంకోర్టును ఆశ్రయించామని వెల్లడించారు.. ఇక, అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఫిబ్రవరిలో ఆశిష్ మిశ్రా జైలు నుంచి కూడా బయటకు వచ్చారు.. ఇప్పుడు బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు.. వారం రోజుల్లో లొంగిపోవాలని ఆశిష్ మిశ్రాను ఆదేశించింది. కాగా, అక్టోబర్ 3, 2020న లఖింపూర్ ఖేరీలో జరిగిన హింసలో నలుగురు రైతులతో సహా ఎనిమిది మంది చనిపోయిన విషయం తెలిసిందే.. ఆందోళన చేస్తున్న రైతులపైకి ఆశిష్ మిశ్రా కాన్వాయ్ దూసుకెళ్లడంతో.. రైతులు మృతిచెందగా.. ఆ తర్వాత హింస చెలరేగిన విషయం విదితమే.