Supermoon 2026: జనవరి 3న పెద్దగా కనిపించనున్న చంద్రుడు.. దీనికి కారణం ఇదే..
- జనవరి 3న ఏడాదిలో తొలి ‘‘సూపర్ మూన్’’..
- సాధారణం కన్నా పెద్దగా కనిపించనున్న చంద్రుడు..
- భూమికి దగ్గరగా రానున్న మూన్..
Supermoon 2026: కొత్త ఏడాది 2026 మొదలైన మూడు రోజులకే అంతరిక్షంలో తొలి అద్భుతం కనిపించబోతోంది. జనవరి 3న ‘‘వోల్ఫ్ మూన్’’గా పిలిచే ‘‘సూపర్ మూన్’’ దర్శనమివ్వబోతోంది. పౌర్ణమి చంద్రుడు సాధారణం కన్నా చాలా ప్రకాశవంతంగా, పెద్దగా కనువిందు చేయనున్నాడు. చంద్రుడు భూమికి దగ్గరగా రావడం వల్ల సూపర్ మూన్ ఏర్పడుతుంది.
Read Also: AP Liquor Sales: రూ.2,767 కోట్ల అమ్మకాలు.. లిక్కర్ సేల్స్‌కు ప్రధాన కారణాలు ఇవే!
Also Read
- Repolling in Bengal: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు.. 15 బూత్‌లలో రీపోలింగ్ ప్రారంభం
- Tamil Nadu Politics: తమిళనాడులో రాజకీయ సంచలనం.. ‘విజయ్’ కింగ్ మేకర్‌గా మారతారా? మరో షాకింగ్ సర్వే!
- GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్‌లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
- Bengal Elections: ఎన్నికల కౌంటింగ్ ముందు సుప్రీంకోర్టుకు తృణమూల్..
చంద్రుడి కక్ష్య వృత్తాకారంలో కాకుండా దీర్ఘవృత్తాకారంలో ఉంటుంది. దీంతో కొన్ని సమయాల్లో చంద్రుడు భూమికి దగ్గరగా వస్తాడు. కొన్ని సమయాల్లో భూమికి దగ్గరగా (పెరిజీ), మరికొన్ని సమయాల్లో దూరంగా (అపోజీ) ఉంటాడు. పౌర్ణమి రోజు చంద్రుడు భూమికి అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు కనిపించేదే సూపర్‌మూన్‌గా వ్యవరిస్తుంటాం. జనవరి 3న చంద్రుడు భూమికి సుమారుగా 3,56,500 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. దీని వల్ల సాధారణం కన్నా 14శాతం పెద్దగా, 30శాతం ఎక్కువ ప్రకాశవంతంగా కనిపిస్తాడు. భూమి, చంద్రుడి మధ్య సరాసరి దూరం సుమారు 3,84,400 కిలోమీటర్లు. పెరీజీ సమయంలో 3,56,500 కిలోమీటర్లు, అపోజీ సమయంలో 4,06,700 కిలోమీటర్లు దూరం ఉంటుంది.
2026లో జరిగే సంఘటనకు మరో ప్రత్యేకత ఉంది. ఇది పెరిహెలియన్, అంటే భూమి సూర్యునికి అత్యంత దగ్గరగా ఉండే బిందువుతో ఏకీభిస్తుంది. ఈ సమయంలో పెరిజియన్ స్ప్రింగ్ అలలు కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. తీర ప్రాంతాల్లోని ప్రజలు సముద్ర అలలు పెద్దవిగా ఉండటం గమనించవచ్చు. జనవరి 3న ప్రకాశవంతమైన చంద్రుడిని చూసేందుకు అత్యుత్తమ సమయం సాయంత్రం 5 గంటల 45 నిమిషాలు.
తాజావార్తలు
-
AP WhatsApp Services: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. వాట్సాప్‌లోనే మెడికల్ కౌన్సిల్ సేవలు
-
Curd Rice Recipe: వడదెబ్బకు చెక్.. వేసవిలో చల్లని ఉపశమనం కోసం పెరుగన్నం.. ఇలా తయారు చేసుకోండి
-
Trump: వెనిజులా, ఇరాన్ తర్వాత నెక్ట్స్ టార్గెట్ ఫిక్స్.. ఆ దేశం లొంగిపోవాల్సిందేనని ట్రంప్ అల్టిమేటం
-
Kyle Jamieson: 15 ఏళ్ల కుర్రాడిపై అంత ఆవేశమేంటి భయ్యా.. వైభవ్‌ను అవుట్ చేసి జేమీసన్ అతి.. నెటిజన్ల ఫైర్!
-
Repolling in Bengal: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు.. 15 బూత్‌లలో రీపోలింగ్ ప్రారంభం
ట్రెండింగ్
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!