Site icon NTV Telugu

Sunny Leone’s pic on hall ticket: హాల్ టికెట్‌‌పై సన్నీ లియోన్ ఫోటో.. విచారణకు ఆదేశం

Sunny Leone's Pic On Hall Ticket

Sunny Leone's Pic On Hall Ticket

Sunny Leone’s pic on hall ticket of Karnataka govt exam, probe ordered: కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం మరో వివాదంలో చిక్కుకుంది. పరీక్ష హాల్ టికెట్ పై శృంగార తార సన్ని లియోన్ ఫోటో ముద్రించడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది. కర్ణాటక టీచర్స్ రిక్రూట్మెంట్ పరీక్షకు హాజరువుతున్న అభ్యర్థి తనకు బదులుగా సన్నిలియోన్ ఫోటో ఉండటాన్ని గుర్తించారు. దీంతో ఈ హాల్ టికెట్ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. రాష్ట్ర విద్యాశాఖ విచారణకు ఆదేశించింది.

Read Also: Vikram-S: దేశంలో తొలి ప్రైవేటు రాకెట్ ప్రయోగానికి రంగం సిద్ధం.. అంతరిక్ష రంగంలో నూతన శకం..

ట్విట్టర్ ద్వారా కర్ణాటక కాంగ్రెస్ సోషల్ మీడియా చైర్ పర్సన్ బీఆర్ నాయుడు మంగళవారం రాష్ట్ర విద్యాశాఖపై విమర్శలు గుప్పించారు. ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్ హాల్ టికెట్ లో అభ్యర్థి ఫోటోకు బదులు రాష్ట్ర విద్యాశాఖ బ్లూ ఫిల్మ్ నటి సన్నీలియోన్ ఫోటోను ముద్రించింది.. అసెంబ్లీలో నీలి చిత్రాలను చూసే పార్టీ నుంచి ఇంకేం ఆశించగలం అని ఆయన కన్నడలో ట్వీట్ చేశారు.

కాంగ్రెస్ ఆరోపణలపై విద్యాశాఖ మంత్రి బీసీ నగేష్ కార్యాలయం స్పందించింది. అప్లికేషన్ సందర్భంలో అభ్యర్థి ఏ ఫోటోను అప్ లోడ్ చేస్తే దాన్నే సిస్టం తీసుకుంటుందని పేర్కొంది. ఈ విషయంపై అభ్యర్థిని ప్రశ్నించగా.. తన వివరాలను తన భర్త స్నేహితుడు అప్ లోడ్ చేసినట్లు చెప్పిందని.. దీనిపై విచారణ జరిపి త్వరలోనే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని కర్ణాటక విద్యాశాఖ తెలిపింది.

Exit mobile version