Sunetra Pawar: మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా రేపు సాయంత్రం 5 గంటలకు అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ ప్రమాణస్వీకారం చేయనున్నారని సమాచారం. ఈ రోజు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో ఎన్సీపీ నేతలు సమావేశమయ్యారు. సునేత్రా పవార్‌కు అత్యున్నత పదవి ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. ఆమెకు ఎక్సైజ్, క్రీడా మంత్రిత్వ శాఖలు ఇచ్చే అవకాశం ఉంది. గతంలో రాష్ట్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అజిత్ పవార్ వద్ద ఉండేది. అయితే, మార్చిలో బడ్జెట్ సమావేశాలు ఉన్నందున ఆర్థిక శాఖ తాత్కాలికంగా ఫడ్నవీస్ వద్దే ఉంది. ఆ తర్వాత దీనిని ఎన్సీపీకి అప్పగించే అవకాశం ఉంది.
Read Also: Ambati Rambabu: చంద్రబాబు, పవన్ కల్యాణ్ నోర్లు ఎందుకు మూత పడ్డాయి..?
రాబోయే బడ్జెట్ సమావేశానికి ముందు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఫిబ్రవరి 7న జరగనున్న పూణే జిల్లా పరిషత్ ఎన్నికలక ముందు పార్టీకి దిశానిర్దేశం చేసేందుకు సునేత్ర పవార్‌ను ఉపముఖ్యమంత్రిగా చేయాలని పార్టీ సీనియర్ నేతలు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలపై పవార్ కుటుంబంలో చర్చలు జరిగాయని వర్గాలు తెలిపాయి. ఈ చర్చల అనంతరం, అత్యున్నత పదవి చేపట్టడానికి సునేత్ర అంగీకరించారు. ఉప ముఖ్యమంత్రిగా ఆమె ప్రమాణస్వీకారం శనివారం జరిగితే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని సీఎం ఫడ్నవీస్ చెప్పారని ఎన్సీపీ సీనియర్ నేత ఛగన్ భుజ్‌బల్ అన్నారు.
