NTV Telugu Site icon

Students Self Distraction: మూడు రాష్ట్రాల్లో విద్యార్థుల ఆత్మహత్యలు.. ఎల్‌పీయూలో విద్యార్థుల ఆందోళన

Lpu

Lpu

Students Self Distraction-Huge protest at Lovely Professional University:ఉత్తర్ ప్రదేశ్, తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాల్లో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అలహాబాద్ యూనివర్సిటీలో తారాచంద్ హస్టల్ లో ఓ విద్యార్థి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఫీజు పెంపు నిర్ణయం వల్లే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఆత్మహత్య విషయం యూనిర్సిటీ మొత్తం వ్యాపించడంతో విద్యార్థులంతా నిరసన, ఆందోళనలు చేపట్టారు. విద్యార్థులు ఫీజు పెంపును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అయితే మరణించిన విద్యార్థి జయ కపూర్ యూనివర్సిటీకి చెందిన వాడు కాదని.. హాస్టల్ లో నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్నారని.. ఫీజు పెంపుతో ఈ ఆత్మహత్యకు సంబంధం లేదని వర్సిటీ వర్గాలు తెలిపాయి.

Read Also: Hunger Deaths: ప్రపంచంలో ప్రతీ నాలుగు సెకన్లకు ఒక ఆకలి చావు.

తమిళనాడులో 12వ తరగతి చదువుతున్న విద్యార్థిని మంగళవారం బలవన్మరణానికి పాల్పడింది. తూతుకూడి జిల్లా ససువందనైలోని స్కూల్ లోని వాష్‌రూమ్‌లో ఉరి వేసుకుని కనిపించింది. తమిళనాడు రామనాథపురానికి చెందిన 17 ఏళ్ల వైథీశ్వర అనే బాలిక ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. బాలిక శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోవిల్ పట్టి ఆస్పత్రికి తరలించారు. వ్యక్తిగత కారణాల వల్లే బాలిక ఆత్మహత్య చేసుకుందని పోలీసులు వెల్లడించారు.

పంజాబ్ లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో విద్యార్థి ఆత్మహత్య తీవ్ర ఉద్రిక్తతకు కారణం అయింది. జలంధర్ లోని ఎల్పీయూలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కొన్ని కారణాల వల్ల ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు విద్యార్థి సూసైడ్ నోట్ లో వెల్లడించారు. ఈ ఆత్మహత్య యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. భారీగా విద్యార్థులు నిరసన తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే విద్యార్థులు మాత్రం పెద్ద సంఖ్యలో ఆందోళనలకు దిగారు. వ్యక్తిగత కారణాల వల్లే విద్యార్థి చనిపోయాడని వర్సిటీ వర్గాలు పేర్కొన్నాయి. చంఢీగడ్ యూనివర్సిటీలో విద్యార్థినుల ఎంఎంఎస్ లకు సంబంధించిన ఆందోళనలు జరుగుతున్న రోజు వ్యవధిలోనే ఎల్పీయూలో విద్యార్థి ఆత్మహత్యపై ఆందోళనలు ఎగిసిపడుతున్నాయి.