Site icon NTV Telugu

MP: ఉపాధ్యాయురాలిపై విద్యార్థి వ్యామోహం.. దూరం పెట్టడంతో ఎంత పని చేశాడంటే..!

Mpstudentteacher

Mpstudentteacher

వయసులో కలిగే కోర్కెలకు కళ్లెం వేసుకోకపోతే లేనిపోని అనర్థాలు జరుగుతాయని మానసిక నిపుణులు హెచ్చరిస్తూ ఉంటారు. హైస్కూల్ వయసులోనో.. లేదంటే కాలేజీ వయసులోనో సహజంగా రకరకాలైన ఆలోచనలు పడుతుంటాయి. వాటిని అనుచుకుంటే జీవితం సాఫీగా సాగిపోతుంది. లేదంటే కార్యరూపం దాలిస్తే.. లోనిపోని కష్టాలు కొనితెచ్చుకున్నట్లు అవుతుంది. ఇదంతా ఎందుకంటారా? అయితే ఈ వార్త చదవాల్సిందే.

ఇది కూడా చదవండి: CP Radhakrishnan: ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణన్ నామినేషన్.. మోడీ హాజరు

మధ్యప్రదేశ్‌లో సూర్యాంష్ కొచార్ అనే 18 ఏళ్ల విద్యార్థి.. ఒక ఉపాధ్యాయురాలిపై ఏకపక్షంగా వ్యామోహం పెంచుకున్నాడు. రెండేళ్ల నుంచి టీచర్‌తో విద్యార్థికి పరిచయం ఉంది. దీంతో ఆమెతో బాగా అనుబంధాన్ని పెంచుకున్నాడు. ఆమెకు తెలియకుండానే ప్రేమిస్తున్నాడు. కానీ అది హద్దులు దాటడంతో కష్టాలు కొని తెచ్చుకున్నాడు.

ఇది కూడా చదవండి: Trump-Modi: భారత్‌పై సుంకాలు పెంచింది అందుకే.. వైట్‌హౌస్ క్లారిటీ

నర్సింగ్‌పూర్ జిల్లాలోని కొత్వాలి పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఎక్సలెన్స్ స్కూల్‌లో సూర్యాంష్ కొచార్ పూర్వ విద్యార్థిగా ఉన్నాడు. అదే పాఠశాలలో 26 ఏళ్ల మహిళ గెస్ట్ టీచర్‌గా పని చేస్తోంది. అయితే కొచార్ ఏకపక్షంగా ఆమెపై వ్యామోహం పెంచుకున్నాడు. ఆమెకు మాత్రం ఎలాంటి ఆలోచన లేదు. అయితే ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు గెస్ట్ టీచర్ చీర ధరించుకుని వేడుకలకు హాజరైంది. అయితే ఆమె చీరపై కొచార్ అభ్యంతరకరమైన కామెంట్ చేశాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కొచార్‌ను పోలీస్ స్టేషన్‌కు పిలిచి మందలించారు. అంతే కొచార్ పగతో రగిలిపోయాడు. తనపై కంప్లంట్ చేస్తుందా? అని కోపంతో మండిపోయాడు.

సోమవారం మధ్యాహ్నం 3:30 గంటలకు కొచార్ పెట్రోల్ బాటిల్ తీసుకుని టీచర్ ఇంటికి వెళ్లాడు. ఆమెతో ఎలాంటి సంభాషణ లేకుండానే పెట్రోల్ పోసి నిప్పు అంటించి పరారయ్యాడు. దీంతో ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. 10-15 శాతం గాయాలతో బాధితురాలు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. తీవ్రగాయాలు ఉన్నప్పటికీ ప్రాణాపాయం లేదని వైద్యులు నిర్ధారించారు.

నిందితుడు-ఉపాధ్యాయురాలు రెండు సంవత్సరాలకు పైగా ఒకరికొకరు తెలుసు అని పోలీసులు తెలిపారు. సూర్యాంశ్ ఆమె పట్ల ఏకపక్ష అనుబంధాన్ని పెంచుకున్నాడని పోలీసులు వెల్లడించారు. నిందితుడు టీచర్ చీరపై అభ్యంతరకరమైన వ్యాఖ్య చేయడంతో మొదలైన వివాదం.. ఈ దారుణానికి కారణమైందని సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ మనోజ్ గుప్తా తెలిపారు. విద్యార్థిది ఏకపక్ష ప్రేమ మాత్రమే అని తెలిపారు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు కొత్వాలి పోలీసులు వేగంగా చర్య తీసుకున్నట్లు చెప్పారు. కొన్ని గంటల్లోనే డోంగర్గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కళ్యాణ్‌పూర్ గ్రామం నుంచి నిందితుడిని అరెస్టు చేశారు. ప్రస్తుతం కస్టడీలో ఉన్నాడని.. దర్యాప్తు జరుగుతోందని చెప్పారు.

Exit mobile version