Supreme Court: అందుబాటు ధరల్లో వైద్య సంరక్షణ, సదుపాయాలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఫెయిల్ అయ్యాయని సుప్రీంకోర్టు మండిపడింది. స్టేట్ గవర్నమెంట్స్ వైఫల్యమే ప్రైవేటు ఆస్పత్రులకు ప్రోత్సాహకంగా మారింది.. ప్రైవేట్ హస్పటల్స్ అన్నీ రోగులు, వారి బంధువుల నుంచి బలవంతంగా అధిక ధరలతో కూడిన మందులను కొనుగోలు చేయిస్తున్నాయని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై తాజాగా సుప్రీంలో విచారణ జరిపింది. తమ ఫార్మసీల నుంచే మెడిసిన్ కొనుగోలు చేయాలని రోగులను బలవంతం చేయొద్దని ప్రైవేట్ ఆసుపత్రులకు ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ వేడుకున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులపై నియంత్రణ చర్యలు తీసుకోవడంలో కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడంతో రోగులు దోపిడీకి గురవుతున్నారని చెప్పుకొచ్చాడు. ఇక, పిటిషనర్ వాదనతో ఏకీభవించిన సుప్రీం ధర్మాసనం.. రోగులకు సూచించిన ఔషధం వేరే చోట తక్కువ ధరకు దొరుకుతున్నప్పుడు.. దానిని తమ ఫార్మసీలోనే కొనుగోలు చేయాలని ప్రైవేటు హస్పటల్స్ బలవంతం చేయకుండా చూడాలని రాష్ట్రాలకు సూచించింది.
Read Also: Navneet Kaur: మహారాష్ట్ర నుంచి ఔరంగజేబు సమాధిని తొలగించండి..
ఇక, సమాజంలోని పేద వర్గాలకు ప్రాణాధార మెడిసిన్ అందుబాటు ధరల్లో లభించడం లేదని సుప్రీంకోర్టు తెలిపింది. పౌరులు ఈ రకమైన దోపిడికీ గురి కాకుండా రక్షించేందుకు తగిన మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అత్యుతున్న న్యాయస్థానం ఆదేశించింది. కాగా, ఇదే విషయమై గతంలో సుప్రీంకోర్టు పలు రాష్ట్రాలకు సైతం నోటీసులు ఇచ్చింది. సుప్రీం నోటీసులకు తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, బీహార్, రాజస్థాన్ రాష్ట్రాలు స్పందించాయి. కౌంటర్ అఫిడవిట్‌ను కూడా దాఖలు చేశాయి. కేంద్రం ఇచ్చిన ధరల నియంత్రణ ఆదేశాలపైనే తాము ఆధారపడతామన్నాయి. అత్యవసర మెడిసిన్ అందుబాటు రేటులో లభించేలా వాటి ధరలను నిర్ణయించినట్లు వెల్లడించాయి.