Starlink : భారత్‌లో స్టార్లింక్కి గ్రీన్‌సిగ్నల్.. అంతరిక్షం నుంచి ఇంటర్నెట్ సేవలు..!
- భారత్‌లో స్టార్‌లింక్ సేవలకు లైసెన్స్ జారీ
- ఇకపై భారత్‌లో ఎలాన్ మస్క్ స్టార్‌లింక్ సేవలు
- దేశంలో మూడో ఇంటర్నెట్ కంపెనీగా స్టార్ లింక్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Starlink : భారత్ మరో విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ కంపెనీ ఓ విభాగమైన స్టార్‌లింక్‌కు దేశంలో ఇంటర్నెట్ సేవలందించేందుకు కేంద్ర ప్రభుత్వం లైసెన్స్‌ను మంజూరు చేసింది. దీంతో భారత్‌లో కార్యాచరణ ప్రారంభించనున్న మూడో ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ ప్రొవైడర్‌గా స్టార్‌లింక్ నిలవనుంది.
ఇందుకు సంబంధించి కేంద్ర టెలికం శాఖ (DoT) స్టార్‌లింక్‌కు పాన్-ఇండియా లైసెన్స్ జారీ చేసింది. ఇప్పటికే భారత్‌లో భారతి గ్రూప్‌కు చెందిన “OneWeb”, జియోతో కలిసి పనిచేస్తున్న “Eutelsat” సంస్థలు ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు వీటిలో స్టార్‌లింక్ చేరడం ద్వారా ఈ రంగంలో పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారనుంది.
Also Read
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
- Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
స్టార్‌లింక్ సేవల ప్రధాన లక్ష్యం భారత్‌లోని గ్రామీణ, ఆన్లైన్ కనెక్టివిటీ లేని ప్రాంతాలను ఇంటర్నెట్తో అనుసంధానించడం. ఎలాంటి ఫైబర్ కేబుల్స్ లేకుండానే, నేరుగా ఉపగ్రహాల ద్వారా ఇంటర్నెట్ను అందించే ఈ సాంకేతికత, వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌ను కూడా హామీ ఇస్తోంది.
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే లక్షల మంది వినియోగదారులకు స్టార్‌లింక్ సేవలు అందుతోంది. భారత్‌లో లైసెన్స్ వచ్చిన నేపథ్యంలో, త్వరలోనే సేవల అందుబాటు, ధరలు, ప్లాన్లు వంటి వివరాలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. గతంలో స్టార్‌లింక్ భారత్‌లో సేవలు ప్రారంభించేందుకు ప్రయత్నించినప్పటికీ, లైసెన్స్ లేకపోవడంతో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికం ఆ సంస్థను ఆపేసింది. అప్పటి వరకు కొన్ని వందల ప్రీ-ఆర్డర్లను కంపెనీ స్వీకరించగా, వాటిని రద్దు చేసి డబ్బు తిరిగి చెల్లించాల్సి వచ్చింది. ఈసారి అధికారిక లైసెన్స్‌తో మళ్లీ రంగంలోకి దిగుతున్న స్టార్‌లింక్, ముందుగా కొన్ని రాష్ట్రాల్లో ట్రయల్ నడిపే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..