NTV Telugu Site icon

Jagannath Rath Yatra: పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. పలువురికి గాయాలు

Puri

Puri

ఒడిశాలోని పూరిలో ఈరోజు భారీ జగన్నాథ రథయాత్ర ప్రారంభమైంది. ఈ యాత్రలో తొక్కిసలాట జరిగింది. పలువురు గాయడగా..వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పూరీలోని బడా దండాలో చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. అంతే కాకుండా రథాన్ని లాగుతుండగా జరిగిన ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ముందుగా బలభద్రుడి రథాన్ని లాగుతుండగా ఈ ఘటన జరిగిందని చెబుతున్నారు.

READ MORE: Minister Kollu Ravindra: రేపటి నుంచి ఏపీలో ఉచిత ఇసుక.. మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు

పూరీ శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి తన శిష్యులతో కలసి జగన్నాథ భగవానుడు, బలభద్రుడు మరియు సుభద్ర దేవతల రథాలను దర్శించుకున్నారు. పూరీ రాజు ‘చేర పహనార’ (రథాన్ని శుభ్రపరచడం) ఆచారాన్ని నిర్వహించారు. ఆ తర్వాత సాయంత్రం 5.20 గంటలకు రథాన్ని ప్రారంభించారు. లాగడం ప్రక్రియ ప్రారంభమైంది. రథాలలో చెక్క గుర్రాలను ఉంచి, భక్తులకు రథాలను సరైన దారిలో లాగేందుకు సేవాదారులు మార్గనిర్దేశం చేశారు. ఈ సమయంలో, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మూడు రథాలను ‘ప్రదక్షిణ’ చేసి, దేవతలకు నమస్కరించారు.

READ MORE:Minister Kollu Ravindra: రేపటి నుంచి ఏపీలో ఉచిత ఇసుక.. మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు

కాగా..జగన్నాథ్ రథ యాత్ర ప్రతి యేటా హిందూ మాసం ఆషాఢలోని శుక్లపక్షం ద్వితీయ తిథిన ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగా ఆదివారం ఉయం ద్వితీయ తిధి 4.26 గంటలకు ప్రారంభమైన జూలై 8 న ఉదయం 4.59 గంటలకు ముగుస్తుంది. పూరీ ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటికల్లా ప్రత్యేకమైనది జగన్నాథ రథయాత్ర. దేశంలో పూరీ జగన్నాథ రథయాత్ర అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ ఉత్సవం ప్రతీ సంవత్సరం జూన్ లేదా జూలై నెలల్లో నిర్వహిస్తారు. ఈ రథయాత్రలో శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర విగ్రహాలను పూరీ నగర వీధుల్లో ఊరేగిస్తారు. ఈ రథం దాదాపు 45 అడుగుల ఎత్తు, 35 చదరపు అడుగుల వైశాల్యం కలిగి ఉంటుంది. దీనికి ఏడు అడుగుల వ్యాసం కలిగిన 16 చక్రాలు ఉంటాయి. దాదాపు నాలుగు వేల మంది భక్తులు కలిసి ఈ రథాన్ని లాగుతారు. నేత్రపర్వంగా సాగే ఈ ఉత్సవాన్ని వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు లక్షలాదిగా తరలి వస్తారు. ప్రతి యేటా కొత్త రథాన్ని తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత. ఈ యాత్ర పూరీ నుండి గుండిచా దేవాలయం వరకు సాగుతుంది.