Tamil Nadu: నామినేషన్ వేసిన స్టాలిన్, విజయ్.. ర్యాలీలతో ప్రచారం జోరు

  • వేడెక్కిన తమిళనాడు ఎన్నికల పోరు
  • నామినేషన్ వేసిన స్టాలిన్, విజయ్
  • ర్యాలీలతో ప్రచారం జోరు
Mkstalin

Mkstalin

తమిళనాడు ఎన్నికల పోరు వేడెక్కుతోంది. రసవత్తరంగా ప్రచారం సాగుతోంది. అన్ని పార్టీల నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇక సోమవారం ఉదయం కొలత్తూరు నుంచి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నామినేషన్ దాఖలు చేశారు. అలాగే టీవీకే అధినేత విజయ్ కూడా పెరంబూర్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత కట్టుదిట్టమైన భద్రత నడుమ, పార్టీ కార్యకర్తలు, అభిమానుల మద్దతుతో రిటర్నింగ్ కేంద్రానికి వచ్చారు.

ఇది కూడా చదవండి: IPS Couple Wedding: మూడు ముళ్లుతో ఒక్కటైన ఐపీఎస్ జంట.. ఫొటోలు వైరల్

విజయ్ రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నారు. తిరుచారాపల్లి ఈస్ట్, పెరంబూర్ నుంచి విజయ్ పోటీ చేస్తున్నారు. సోమవారం పెరంబూర్ నుంచి విజయ్ నామినేషన్ దాఖలు చేశారు. ఇక నామినేషన్ దాఖలు చేయగానే పెరంబూర్‌ నుంచి విజయ్ ఎన్నికల ర్యాలీ ప్రారంభించారు.

ఇది కూడా చదవండి: Red Sky: ఆకాశంలో వింత.. రక్తవర్ణంగా మారిన స్కై.. ఫొటోలు వైరల్