Red Sky: ఆకాశంలో వింత.. రక్తవర్ణంగా మారిన స్కై.. ఫొటోలు వైరల్
- ఆకాశంలో వింతైన అద్భుతం
- ఒక్కసారిగా రక్తవర్ణంగా మారిన స్కై
- భయాందోళనతో బెంబేలెత్తిపోయిన ప్రజలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆకాశంలో వింత చోటుచేసుకుంది. మునుపెన్నడూ లేని విధంగా ఆకాశం రక్తవర్ణంలోకి మారిపోయింది. ఈ వింతైన సంఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. అచ్చం హాలీవుడ్ సినిమా మాదిరిగా వాతావరణం మారిపోయింది. ఈ ఘటనతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏదైనా ప్రళయం సంభవిస్తోందేమో అని ఆందోళనకు గురయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి.
పశ్చిమ ఆస్ట్రేలియాలో ఉదయాన్నే ప్రజలకు వింతైన వాతావరణం దర్శనమిచ్చింది. ఉదయాన్నే నిద్ర లేచిన వారంతా వింతైన దృశ్యాలు చూసి భయకంపితులయ్యారు. ఎటుచూసినా ఎర్రటి ఆకాశం కనిపించింది. దీంతో ఏం జరుగుతుందో అర్థం కాక అందరిలో వణుకు పుట్టింది. ప్రపంచం అంతం అయిపోతుందా? అన్నట్టుగా వాతావరణం కనిపించగానే హడలెత్తిపోయారు. దీంతో పశ్చిమ ఆస్ట్రేలియాలోని షార్క్ బే, డెన్హామ్ ప్రజలకు ఉదయం ఒక పీడకలగా మారిపోయింది.
Also Read
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
- Zelenskyy: కొత్త ప్రాంతీయ కూటమి ఏర్పాటు చేసిన జెలెన్స్కీ.. ఏఏ దేశాలున్నాయంటే..!

ఎప్పటిలాగానే శనివారం ఉదయం సూర్యుడు ఉదయించాడు.. కానీ అంతలోనే వెలుగు మాయమైంది. ఒక్కసారిగా ఎరుపు రంగుగా మారిపోయింది. ఎటుచూసినా ఎర్రగానే కనిపించింది. ఇళ్లు, రోడ్లు, వాహనాలు, చివరికి సముద్ర తీరం కూడా ఎర్రటి దుప్పటితో కప్పేసింది. దీంతో ప్రళయం రాబోతుందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ప్రజలంతా బయటకు వచ్చి వింతగా వీక్షించారు. మరికొందరు బెంబేలెత్తిపోయారు.
అసలేం జరిగిందంటే..
మార్చి 27న ఉష్ణమండల తుఫాను నరెల్లే ఉన్నట్లుగా వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో తుఫాను తీరాన్ని తాకబోతుందని వార్నింగ్ ఇచ్చింది. దీంతో ఎడారిలో ఇనుము సమృద్ధిగా ఉండటంతో ఎర్రటి మట్టిని మేఘంలా మార్చి ఆకాశంలోకి ఎగరగొట్టింది. దీంతో ఉదయాన్నే సూర్యరశ్మి సూక్ష్మ ధూళి కణాలపై పడడడంతో ఒక్కసారిగా ఆ దృశ్యమంతా రక్తవర్ణంలోకి మారిపోయింది. ఆకాశం ఎర్రగా మారడం వెనుక ఉన్న రహస్యం ఇదేనని నిపుణులు పేర్కొన్నారు.
ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రకరకాలైన ఊహాగానాలు మొదలయ్యాయి. చాలా మంది భయాందోళనలతో ప్రజలు ఇళ్లల్లోంచి బయటకు రాలేదు. అధికారులు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పినా కూడా ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురైనట్లు సమాచారం.
🚨🇦🇺 The sky turned blood red across Western Australia as Tropical Cyclone Narelle pushed dust through the air.
Between the meteors and now this, 2026 is giving very biblical vibes and we're only in March…pic.twitter.com/Fc6jcHmbES https://t.co/OUTQHM5NBl
— Mario Nawfal (@MarioNawfal) March 28, 2026
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..