Site icon NTV Telugu

Shashi Tharoor: ‘‘భారతీయుడిగా మాట్లాడా’’.. కాంగ్రెస్ ‘‘లక్షణరేఖ’’ వ్యాఖ్యలపై శశిథరూర్..

Shashitharoor

Shashitharoor

Shashi Tharoor: భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు హస్తం పార్టీకి రుచించడం లేదు. కాంగ్రెస్ పార్టీలోని ఓ వర్గం థరూర్ ‘‘లక్ష్మణ రేఖ’’ దాటారని భావిస్తున్నారు. అయితే, దీనిపై శశి థరూర్ స్పందించారు. ‘‘భారతీయుడిగా గర్వించదగిన పౌరుడిగా ఈ వ్యాఖ్యలు చేశాను’’ అని స్పష్టం చేశారు. వ్యక్తిగత హోదాలో తన అభిప్రాయాలను చెప్పానని, అవి పార్టీ వైఖరిన ప్రతిబింబించవని, తాను పార్టీ అధికార ప్రతినిధిని కాదని ఆయన గురువారం చెప్పారు.

Read Also: Operation Sindoor: పాకిస్తాన్‌కి అండగా నిలిచిన చైనా, టర్కీ.. సంచలన విషయాలు వెలుగులోకి..

‘‘ఈ విషయాలలో కొన్నింటిపై నాకు జ్ఞానం ఉందని ప్రజలు భావిస్తున్నట్లు అనిపిస్తుంది. కాబట్టి వారు వచ్చి నా అభిప్రాయాలను అడుగుతారు. నేను చాలా స్పష్టంగా, కొన్నిసార్లు స్పష్టంగా మరియు కొన్నిసార్లు పరోక్షంగా, ఒక భారతీయుడిగా, గర్వించదగిన పౌరుడిగా నా వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నానని చెబుతున్నాను. మీరు దానితో ఏకీభవించవచ్చు. విభేదించవచ్చు. నన్ను నిందించవచ్చు.’’ అని అన్నారు.

తాను తన పరిమితుల్ని దాటినట్లు కొంతమంది కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారని అడిగినప్పుడు, ఇవి ఎక్కడ నుంచి వస్తున్నాయో నాకు తెలియదని థరూర్ అన్నారు. కేంద్రం ప్రభుత్వం పాకిస్తాన్‌పై చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ని ప్రశంసించడం కాంగ్రెస్ పార్టీకి రుచించడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శశిథరూర్‌ని పార్టీలోని ఓ వర్గం టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్, ట్రంప్ ఒత్తిడితో భారత్ సైనిక చర్యని ఆపేసిందని నిందిస్తున్న సమయంలో, ట్రంప్ చేసిన వాదనల్ని థరూర్ ఖండించారు.

Exit mobile version