SpiceJet-Fact Check: ఇండియాలో అందరూ ప్రేమించే, భయపడే ఎయిర్ లైన్స్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియాలో అందరూ ప్రేమించే ఎయిర్‌లైన్స్ స్పైస్‌జెట్ అని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్(ఎండీ) అజయ్‌సింగ్ చెప్పుకున్నారు. ప్యాసింజర్ లోడ్ ఫ్యాక్టరే (పీఎల్ఎఫ్) దీనికి నిదర్శనమని చెప్పారు. ఈ నెల 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు 80 శాతానికి పైనే సీట్లు నిండాయని వెల్లడించారు. తమపై నమ్మకం ఉంచినందుకు ప్రయాణికులకు ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పారు. ఈ నేపథ్యంలో నిన్న బుధవారం ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో ఫుల్ పేజీ యాడ్ కూడా ఇచ్చారు. అందులో ఈ సంస్థ ఏం పేర్కొందంటే..
మన దేశంలో వరుసగా ఏడేళ్లు అత్యధిక ఆక్యుపెన్సీని నమోదు చేసిన విమానయాన సంస్థ మాదే. హయ్యస్ట్ ఆక్యుపెన్సీని సాధిస్తూ నేటితో 84 నెలలు (7 సంవత్సరాలు) పూర్తి చేసుకున్నాం. ప్రపంచ వైమానిక చరిత్రలో ఈ ఫీట్‌ని ఇంతవరకు ఎవరూ సాధించలేదు. ప్రతి సంవత్సరం ఫ్లైట్లు ఎక్కుతున్న భారతీయుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మేం ఇదే ఉత్సాహంతో ఈ దేశ ప్రజల ఆకాశయానానికి రెక్కలు తొడుగుతాం. మా విమానాలతో 58 దేశీయ, అంతర్జాతీయ గమ్యస్థానాలను కలుపుతున్నాం.
Also Read
- Bihar: బీహార్‌లో రణరంగం.. సీఎం ఇంటి ముట్టడికి దూసుకెళ్లిన BPSC అభ్యర్థులు.. లాఠీఛార్జ్, వాటర్ కెనన్ల ప్రయోగం
- Maharashtra: ఐఫోన్ కోసం కొండపై నుంచి దూకలేదు.. మహారాష్ట్ర ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- Allahabad High Court: హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి కాదు..! అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు..
- Gurmeet Ram Rahim Release: మరోసారి జైలు నుంచి బయటకు డేరా బాబా.. 17వ సారి పెరోల్‌పై విడుదల
రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ ‘ఉడాన్’లో అతిపెద్ద ఆపరేటర్‌గా నిలిచాం. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) ఆపరేషనల్ సేఫ్టీ ఆడిట్ సర్టిఫికెట్ కలిగి ఉన్నాం. మా జర్నీ ప్రారంభమై ఇప్పటికి 17 ఏళ్లు. ఈ సుదీర్ఘ కాలంలో ఒకటిన్నర బిలియన్ కిలో మీటర్లు ప్రయాణించాం. 18 కోట్ల మంది ప్యాసింజర్లను సంతోషంగా గమ్య స్థానాలకు చేర్చాం. ఇదీ.. స్పైస్ జెట్ తన వాణిజ్య ప్రకటనలో చెప్పుకున్న గొప్ప సంగతులు. కానీ.. ఇది నాణేనికి ఒక వైపు మాత్రమే. నిజం చెప్పాలంటే నాణేనికి మరో వైపు ఈ సంస్థ పెర్ఫార్మెన్స్ అంత బాగేం లేదు.
గత 24 రోజుల్లో 9 సార్లు స్పైస్ జెట్ విమానాల్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ బయటపడ్డాయి. అంటే సాంకేతికపరంగా ఈమధ్య కాలంలో ఒడిదుడుకులకు లోనవుతోంది. దీంతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) స్పైస్ జెట్‌కి షోకాజ్ నోటీసు కూడా ఇచ్చింది. సురక్షితమైన, సమర్థవంతమైన, విశ్వసనీయమైన విమాన సేవలు అందించడంలో విఫలమయ్యారని, దీనికి ఏం సమాధానం చెబుతారని అడిగింది. అయితే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పైస్ జెట్ (ఎండీ) అజయ్ సింగ్ మాట్లాడుతూ ఈ సాంకేతిక లోపాలు చాలా చిన్నవని, ప్రతి ఎయిర్లైన్స్కీ సహజమేనని చెప్పారు.
అంటే పరోక్షంగా లైట్ తీసుకోమని చెప్పారు. ప్రతి విమానాన్నీ జర్నీకి ముందు క్షుణ్ణంగా చెక్ చేస్తామని, ఇకపై ఇంకా జాగ్రత్తగా ఉంటామన్నారు. సమీప భవిష్యత్తులో స్పైస్ జెట్ విమానాల్లో సాంకేతిక సమస్యలేమీ తలెత్తకపోతే ఈయన చెప్పిన మాటలను స్వాగతించొచ్చు. లేకపోతే ‘అందరూ ప్రేమించే ఎయిర్‌లైన్స్’ అనే మంచి పేరుకు ‘అందరూ భయపడే ఎయిర్‌లైన్స్’ అనే చెడ్డ పేరునూ ముట్టగట్టుకోవాల్సి వస్తుందేమో.
తాజావార్తలు
-
Aashram Season 4: 3 సీజన్లు, 33 ఎపిసోడ్లతో 6 ఏళ్లుగా ఓటీటీని ఏలిన సిరీస్.. నాలుగో సీజన్లో బాబా నిరాలా రిటర్న్!
-
Fake Doctors: హైదరాబాద్‌లో 11 మంది నకిలీ డాక్టర్ల అరెస్ట్..
-
YS Jagan: వ్యవస్థలన్నీ కుప్పకూలాయి.. ప్రతి ఇంట్లో వైసీపీ, కూటమి పాలనపై చర్చ జరుగుతోంది..
-
Toxic Nizam GO : నైజాంలో టాక్సిక్ టికెట్స్ ధరలు పెంచుతూ జీవో రిలీజ్.. బుకింగ్స్ రిలీజ్
-
Yash: బస్సు డ్రైవర్ కొడుకు నుంచి పాన్ ఇండియా స్టార్ వరకు.. యష్ తీసుకున్న రిస్కులే ఈ స్టార్డమ్కు కారణం!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!