NTV Telugu Site icon

Congress: ముంబైని “యూటీ” చేయాలనుకుంటుంది.. అందుకే పార్లమెంట్ సమావేశాలు..

Congress

Congress

Congress: మహారాష్ట్ర రాజధాని, దేశ ఆర్థిక రాజధాని ముంబైని కేంద్రంలోని బీజేపీ సర్కార్ ‘కేంద్రపాలిత ప్రాంతం’ చేయాలనుకుంటోందని రాష్ట్ర కాంగ్రెస్ ఆరోపించింది. రాబోయే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఎజెండా ఇదేనని మహరాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే సోమవారం అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కోవిడ్ మహమ్మారి, నోట్ల రద్దు, మణిపూర్ అంశాలపై ఎప్పుడూ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయలేదని, కానీ ప్రస్తుతం రాబోతున్న సమావేశాల్లో ముంబైని యూటీ ప్రాంతంగా ప్రకటించి మహారాష్ట్రలోని మిగిలిన ప్రాంతాల నుంచి విడదీస్తుందని ఆరోపించారు.

Read Also: Karnataka: దళిత కుటుంబంపై కర్ణాటక మంత్రి దాడి..

ముంబై ఒక అంతర్జాతీయ నగరం, ఆర్థిక రాజధాని అని.. ఇప్పుడు ముంబైలోని ఎయిర్ ఇండియా, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్, డైమండ్ మార్కెట్ వంటి వాటిని నగరం నుంచి తరలించేస్తున్నారని పటోలే ఆరోపించారు. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌, నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లను గుజరాత్‌కి మార్చే యోచనలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. గతంలో శివసేస-కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వం ఈ నిర్ణయాలకు అడ్డంకిగా ఉందనే కేంద్రంలోని బీజేపీ అధికారంలోంచి దించేసిందని ఆయన అన్నారు.

ఈ నెల 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు పిలుపునిచ్చింది. అయితే సమావేశాల ఎజెండా ఇంతవరకు కేంద్రం స్పష్టం చేయలేదు. అయితే ఇండియా-భారత్ పేరు మార్పు, వన్ నేషన్-వన్ ఎలక్షన్ వంటి అంశాలు చర్చకు వస్తాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే 19 తేదీన కొత్త పార్లమెంట్ భవనంలో సమావేశాలు జరుగుతాయని తెలుస్తోంది.

Show comments