Sourav Ganguly: మమతకు మద్దతుగా యూసుఫ్ పఠాన్‌ను గంగూలీ రాజీనామా చేయమన్నారా..? ఇదిగో క్లారిటీ..
- మమతకు మద్దతుగా యూసుఫ్ పఠాన్ రాజీనామా..?
- గంగూలీ ద్వారా దౌత్యం నడిపినట్లుగా ఊహాగానాలు..
- అవాస్తవమని కొట్టిపారేసిన దాదా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sourav Ganguly: పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) సంక్షోభం మధ్య మరో వార్త జోరుగా హల్చల్ చేస్తోంది. బర్హంపూర్ ఎంపీగా ఉన్న యూసుఫ్ పఠాన్‌ను రాజీనామా చేసేలా ఒప్పించాలని సౌరవ్ గంగూలీని మమతా బెనర్జీ కోరినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్లమెంట్ ఉప ఎన్నికల ద్వారా కేంద్ర రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు మమతా బెనర్జీ ఇలా కోరిందనే ప్రచారం నడుస్తోంది. ఒక బెంగాలీ దినపత్రిక ప్రకారం.. యూసుఫ్ పఠాన్ రాజీనామా చేస్తే ఆ స్థానం నుంచి మమతా బెనర్జీ పోటీ చేయవచ్చని టీఎంసీ భావిస్తోందని పేర్కొంది. ఈ క్రమంలోనే రాజీనామా కోసం యూసుఫ్ పఠాన్‌ను ఒప్పించేలా సౌరవ్ గంగూలీని మమత సంప్రదించినట్లు వార్తా కథనం పేర్కొంది. అయితే, పఠాన్ ఈ ప్రతిపాదనను తిరస్కరించినట్లు చెప్పింది.
అయితే, ఈ వార్తపై గంగూలీ స్పందించారు. ‘‘నా గురించి ప్రచురించిన ఆరోపణలు అవాస్తవం. నిజాలు పట్టించుకోకుండా ఇలాంటి వార్తా కథనాలను ప్రచురించారు’’ అని అన్నారు. తాను ఎప్పుడూ రాజకీయ వ్యవహారాల్లో పాల్గొనలేదని స్పష్టం చేశారు. మమతా బెనర్జీ యూసఫ్ పఠాన్‌కు ఏ విషయం చెప్పమని తనను అడగలేదని, తాను యూసుఫ్ పఠాన్‌ను ఈ అంశంపై సంప్రదించలేదని స్పష్టం చేశారు.
Also Read
- PM Modi: ప్రధాని మోడీని కలిసిన స్కూల్ ఫ్రెండ్ అస్గర్ అలీ.. బీజేపీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు..
- Maharashtra: జాయింట్ వీల్లో చిక్కుకున్న మహిళ జడ.. జట్టుతో సహా తల చర్మం ఊడి తీవ్ర గాయం..
- Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
- India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
టీఎంసీలో అంతర్గత సంక్షోభం తీవ్రస్థాయికి చేరుకున్న సమయంలో ఈ వార్త హల్చల్ చేసింది. మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ తీరు నచ్చక పార్టీలోనే తిరుగుబాటు వర్గం ఏకమైంది. మొత్తం 80 మంది ఎమ్మెల్యేలు ఉంటే 60 మంది రీటబ్రత బెనర్జీ వెనక ఉన్నారు. మమతా బెనర్జీ వర్గంలో కేవలం 10 నుంచి 20 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. మరోవైపు ఎంపీల్లో కూడా చీలిక వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
PM Modi: ప్రధాని మోడీని కలిసిన స్కూల్ ఫ్రెండ్ అస్గర్ అలీ.. బీజేపీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు..
-
Maharashtra: జాయింట్ వీల్లో చిక్కుకున్న మహిళ జడ.. జట్టుతో సహా తల చర్మం ఊడి తీవ్ర గాయం..
-
Post Office Schemes: బంపర్ స్కీమ్.. పైసా రిస్క్ లేకుండా నెలనెలా రూ.9 వేలకు పైగా ఆదాయం! ఓ లుక్ వేయండి
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!