Site icon NTV Telugu

Odisha: ఒడిశాలో బోటు బోల్తా.. సౌరవ్ గంగూలీ సోదరుడి కుటుంబానికి తప్పిన ముప్పు

Odisha

Odisha

టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సోదరుడు కుటుంబం ఒడిశాలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. సౌరవ్ గంగూలీ సోదరుడు స్నేహాశిష్, అతని భార్య అర్పిత పూరీ బీచ్‌లో స్పీడ్ బోటులో విహరిస్తుండగా ఒకసారిగా బోల్తా పడింది. బోటులో ఎవరూ లేకపోవడంతో తేలికగా ఉండడంతో బోల్తా పడి పోయింది. దీంతో దంపతులిద్దరూ భయాందోళనకు గురయ్యారు. రక్షించాలంటూ గంగూలీ వదిన అర్పిత కేకలు వేసింది. వెంటనే రంగంలోకి దిగిన లైఫ్‌గార్డులు.. పర్యాటకులందరినీ రక్షించారు. సముద్రంలో అల్లకల్లోలంగా ఉండడంతోనే స్పీడ్‌బోటు బోల్తా పడిందని తెలిపారు. ప్రాణభయంతో అర్పిత కన్నీళ్లు పెట్టుకుంది.

ఇది కూడా చదవండి: Peace Committee: మావోయిస్టుల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకి అప్పగించండి

వేసవి సెలవుల్లో భాగంగా గంగూలీ సోదరుడు స్నేహాశిష్, అతని భార్య అర్పిత ఆదివారం ఒడిశాకు వచ్చారు. అనంతరం పూరీ సమీపంలో సముద్రంలో స్పీడ్ బోటు ప్రయాణానికి సిద్ధమయ్యారు. అయితే సముద్రంలో ఆటుపోటులు ఎక్కువ్వడంతో ఒక్కసారిగా బోటు బోల్తా పడి పోయింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు.. వారిని రక్షించేందుకు రంగంలోకి దిగారు. క్షేమంగా పర్యాటకులందరినీ బయటకు తీసుకొచ్చారు.

ఇది కూడా చదవండి: PSL 2025 Final: పీఎస్ఎల్ ఫైనల్ కోసం 6 వేల కిమీ జర్నీ.. ఫ్లైట్ డబ్బులు వృధా కాలే!

బోటులో పర్యాటకులు లేకపోవడంతోనే బోల్తా పడిందని అర్పిత ఆరోపించారు. పడవలో 10 మంది ప్రయాణించే సామర్థ్యం ఉంటే.. డబ్బుకు కక్కుర్తి పడి ముగ్గురు, నలుగురు వ్యక్తులనే ఎక్కించుకున్నారని.. దీంతో తేలికగా ఉండడంతో తల్లకిందులుగా పడిపోయిందని వాపోయింది. సముద్రంలోకి వెళ్లేందుకు ఆందోళన వ్యక్తం చేశామని.. కానీ ఆపరేటర్లు పర్వాలేదని చెప్పడంతోనే లోపలికి వెళ్లినట్లు అర్పిత తెలిపారు. సముద్రంలోకి వెళ్లగానే ఒక పెద్ద అల బోటును ఢీకొట్టిందని.. దీంతో బోల్తా పడిపోయిందని చెప్పారు. సమయానికి లైఫ్‌గార్డులు రాకపోతే.. ప్రాణాలు పోయేవని.. తాము ఇంకా భయాందోళనలోనే ఉన్నామని.. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదుర్కోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులు రాకుండా ఆపరేటర్లు జాగ్రత్తగా ఉండాలని కోరారు. కోల్‌కతాకు వెళ్లాక.. పూరీ బీచ్‌లో స్పోర్ట్స్ క్రీడలను నిలిపివేయాలని పోలీస్ సూపరింటెండెంట్‌కు, ముఖ్యమంత్రికి లేఖ రాస్తానని పేర్కొన్నారు. ఇకపై పూరీలో స్పోర్ట్స్ క్రీడలు వద్దని విజ్ఞప్తి చేశారు.

ఇదిలా ఉంటే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇలాంటి పరిస్థితుల్లో బోటు ఆపరేటర్లు ఎలా అనుమతించారో అర్థం కావడం లేదు. ఇప్పటికే రుతుపవనాల రాకతో చాలా రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక బోటు బోల్తా దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Exit mobile version