Odisha: ఒడిశాలో బోటు బోల్తా.. సౌరవ్ గంగూలీ సోదరుడి కుటుంబానికి తప్పిన ముప్పు
- ఒడిశాలో బోటు బోల్తా
- సౌరవ్ గంగూలీ సోదరుడి కుటుంబానికి తప్పిన ముప్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సోదరుడు కుటుంబం ఒడిశాలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. సౌరవ్ గంగూలీ సోదరుడు స్నేహాశిష్, అతని భార్య అర్పిత పూరీ బీచ్‌లో స్పీడ్ బోటులో విహరిస్తుండగా ఒకసారిగా బోల్తా పడింది. బోటులో ఎవరూ లేకపోవడంతో తేలికగా ఉండడంతో బోల్తా పడి పోయింది. దీంతో దంపతులిద్దరూ భయాందోళనకు గురయ్యారు. రక్షించాలంటూ గంగూలీ వదిన అర్పిత కేకలు వేసింది. వెంటనే రంగంలోకి దిగిన లైఫ్‌గార్డులు.. పర్యాటకులందరినీ రక్షించారు. సముద్రంలో అల్లకల్లోలంగా ఉండడంతోనే స్పీడ్‌బోటు బోల్తా పడిందని తెలిపారు. ప్రాణభయంతో అర్పిత కన్నీళ్లు పెట్టుకుంది.
ఇది కూడా చదవండి: Peace Committee: మావోయిస్టుల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకి అప్పగించండి
Also Read
- CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
- Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
- Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
- Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
వేసవి సెలవుల్లో భాగంగా గంగూలీ సోదరుడు స్నేహాశిష్, అతని భార్య అర్పిత ఆదివారం ఒడిశాకు వచ్చారు. అనంతరం పూరీ సమీపంలో సముద్రంలో స్పీడ్ బోటు ప్రయాణానికి సిద్ధమయ్యారు. అయితే సముద్రంలో ఆటుపోటులు ఎక్కువ్వడంతో ఒక్కసారిగా బోటు బోల్తా పడి పోయింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు.. వారిని రక్షించేందుకు రంగంలోకి దిగారు. క్షేమంగా పర్యాటకులందరినీ బయటకు తీసుకొచ్చారు.
ఇది కూడా చదవండి: PSL 2025 Final: పీఎస్ఎల్ ఫైనల్ కోసం 6 వేల కిమీ జర్నీ.. ఫ్లైట్ డబ్బులు వృధా కాలే!
బోటులో పర్యాటకులు లేకపోవడంతోనే బోల్తా పడిందని అర్పిత ఆరోపించారు. పడవలో 10 మంది ప్రయాణించే సామర్థ్యం ఉంటే.. డబ్బుకు కక్కుర్తి పడి ముగ్గురు, నలుగురు వ్యక్తులనే ఎక్కించుకున్నారని.. దీంతో తేలికగా ఉండడంతో తల్లకిందులుగా పడిపోయిందని వాపోయింది. సముద్రంలోకి వెళ్లేందుకు ఆందోళన వ్యక్తం చేశామని.. కానీ ఆపరేటర్లు పర్వాలేదని చెప్పడంతోనే లోపలికి వెళ్లినట్లు అర్పిత తెలిపారు. సముద్రంలోకి వెళ్లగానే ఒక పెద్ద అల బోటును ఢీకొట్టిందని.. దీంతో బోల్తా పడిపోయిందని చెప్పారు. సమయానికి లైఫ్‌గార్డులు రాకపోతే.. ప్రాణాలు పోయేవని.. తాము ఇంకా భయాందోళనలోనే ఉన్నామని.. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదుర్కోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులు రాకుండా ఆపరేటర్లు జాగ్రత్తగా ఉండాలని కోరారు. కోల్‌కతాకు వెళ్లాక.. పూరీ బీచ్‌లో స్పోర్ట్స్ క్రీడలను నిలిపివేయాలని పోలీస్ సూపరింటెండెంట్‌కు, ముఖ్యమంత్రికి లేఖ రాస్తానని పేర్కొన్నారు. ఇకపై పూరీలో స్పోర్ట్స్ క్రీడలు వద్దని విజ్ఞప్తి చేశారు.
ఇదిలా ఉంటే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇలాంటి పరిస్థితుల్లో బోటు ఆపరేటర్లు ఎలా అనుమతించారో అర్థం కావడం లేదు. ఇప్పటికే రుతుపవనాల రాకతో చాలా రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక బోటు బోల్తా దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
-
Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
-
AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!