మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల కాంగ్రెస్ అగ్రనేత, రాజ్యసభ ఎంపీ సోనియాగాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. జ్ఞానం, గొప్పతనం, వినయం యొక్క ప్రతిరూపమైన నాయకుడ్ని కోల్పోయినట్లు తెలిపారు. దేశానికి హృదయపూర్వకంగా, మంచి మనస్సుతో సేవ చేశారని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ప్రకాశవంతమైన, ప్రియమైన మార్గదర్శక కాంతి అని కొనియాడారు. కరుణ మరియు దార్శనికత లక్షలాది మంది భారతీయుల జీవితాలను మార్చివేసిందని తెలిపారు. స్వచ్ఛమైన హృదయం, చక్కటి మనసు కారణంగానే భారత ప్రజలు ఆయనను ప్రేమించారని చెప్పారు. ఆయన సలహాలు. అభిప్రాయాలు దేశంలోని రాజకీయ వర్ణపటంలో లోతుగా నాటుకున్నాయన్నారు అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా నాయకులు, పండితులు గౌరవించారని.. అలాగే ఆరాధించారని పేర్కొన్నారు. అపారమైన జ్ఞానం, స్థాయి కలిగిన రాజనీతిజ్ఞుడిగా ప్రశంసించారు. మన్మోహన్ నిర్వహించిన ప్రతి ఉన్నత పదవికి ప్రకాశం మరియు ప్రత్యేకతను తెచ్చిపెట్టిందని వెల్లడించారు. భారతదేశానికి గర్వం మరియు గౌరవాన్ని తెచ్చిపెట్టారని సోనియా గాంధీ కొనియాడారు.
ఇది కూడా చదవండి: Anna University Case: అన్నా యూనివర్సిటీ లైంగిక దాడి.. సుమోటోగా స్వీకరించిన మద్రాస్ హైకోర్టు..
ఇదిలా ఉంటే శుక్రవారం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సంతాప తీర్మానం చేసింది. ఏఐసీసీ కార్యాలయంలో సీడబ్ల్యూసీ సభ్యులు సమావేశమై సంతాప తీర్మానం చేశారు. శనివారం జరిగే మన్మోహన్‌సింగ్ అంతిమసంస్కారాల నిర్వహణపై కూడా చర్చించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, సోనియా, రాహుల్ గాంధీ, ప్రియాంక, తదితర నేతలంతా పాల్గొన్నారు. మన్మోహన్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తామని సీడబ్ల్యూసీ తీర్మానం చేసింది. ఆయన నిజమైన రాజనీతిజ్ఞుడని, దేశం కోసమే తన జీవితాన్ని దారపోశారని గుర్తు చేసుకున్నారు.
ఇది కూడా చదవండి: Pushpa – 2 : నేపాల్ లో కూడా జెండా ఎగరేసిన పుష్పరాజ్
ఇక మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు శనివారం జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనుంది. ఇదిలా ఉంటే మన్మోహన్ అంత్యక్రియలపై కాంగ్రెస్ సీనియర్ నేత వేణుగోపాల్ కీలక ప్రకటన చేశారు. మన్మోహన్ అంత్యక్రియలు శనివారం ఉదయం 9:30 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యాలయం నుంచి ప్రారంభం అవుతుందని తెలిపారు. శనివారం ఉదయం 8:30 గంటల నుంచి 9:30 గంటల వరకు పార్టీ నేతలు, కార్యకర్తల సందర్శనార్థం మన్మోహన్ సింగ్ పార్థీవదేహాన్ని ఏఐసీసీ కార్యాలయంలో ఉంచనున్నారు. ఉదయం 9:30కి ఏఐసీసీ కార్యాలయం నుంచి రాజ్‌ఘాట్ వరకు మన్మోహన్ అంతిమయాత్ర నిర్వహిస్తారు. అనంతరం రాజ్‌ఘాట్ సమీపంలో మన్మోహన్ సింగ్ అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.
ఇది కూడా చదవండి: AP Crime: ఈఎంఐ చెల్లించలేదని సాఫ్ట్‌వేర్ ఉద్యోగినికి న్యూడ్ ఫొటోలు..! ట్విస్ట్ ఏంటంటే..?