Site icon NTV Telugu

Sonia Gandhi: నిలకడగా సోనియాగాంధీ ఆరోగ్యం.. వైద్యుల వెల్లడి

Soniagandhi

Soniagandhi

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగా ఉందని ఢిల్లీలోని గంగారామ్‌ ఆస్పత్రి వెల్లడించింది. అనారోగ్య సమస్యలతో సోనియాగాంధీ ఆదివారం ఉదయం ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచి వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. తాజాగా సోనియా గాంధీ ఆరోగ్యం గురించి ఆస్పత్రి ఛైర్మన్ అజయ్ స్వరూప్ కీలక సమాచారాన్ని మీడియాతో పంచుకున్నారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని.. నిరంతరం వైద్యులు పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: SURIYA : స్టార్ దర్శకులతో సినిమాలు క్యాన్సిల్ చేస్తున్న సూర్య..

ఉదర సంబంధిత సమస్య కారణంగా ఆస్పత్రి గ్యాస్ట్రోలజీ విభాగంలో సోనియాగాంధీ చేరినట్లు ఆస్పత్రి యాజమాన్యం తెలిపింది. సోనియా గాంధీ గత కొన్ని సంవత్సరాలుగా పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం సోనియాగాంధీకి 78 ఏళ్లు. 2022 సంవత్సరంలో కూడా ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో రెండుసార్లు చేరారు. ఆ సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడం, వైరల్ జ్వరం, కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా ఆమె ఆస్పత్రిలో చేరారు.

ఇది కూడా చదవండి: Israel-Iran War: ఇజ్రాయెల్‌కు ఇరాన్ వార్నింగ్.. దాడులు ఆపకపోతే పాకిస్థాన్ అణు దాడి చేస్తుంది

 

Exit mobile version