కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగా ఉందని ఢిల్లీలోని గంగారామ్ ఆస్పత్రి వెల్లడించింది. అనారోగ్య సమస్యలతో సోనియాగాంధీ ఆదివారం ఉదయం ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచి వైద్యులు పర్యవేక్షిస్తున్నారు.
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఢిల్లీలోని గంగారామ్ ఆస్పత్రిలో చేరారు. కరోనా సంబంధిత సమస్యలతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వైద్యులు పర్యవేక్షిస్తున్నారని కాంగ్రెస్ నేత రణ్దీప్ సింగ్ సుర్జేవాలా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సోనియా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈనెల 2న సోనియా గాంధీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికతో ముడిపడి…