Site icon NTV Telugu

Sonia Gandhi: మోడీ, యోగీ ప్రభుత్వాలతో అన్ని వర్గాలకు అన్యాయం

ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్‌, యోగి ఆదిత్యానాథ్‌ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్‌ సర్కార్‌పై విరుచుకుపడ్డారు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ.. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా “వీడియో కాన్ఫరెన్స్‌ ” లో ఓటర్లతో మాట్లాడిన ఆమె.. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు చాలా కీలకమైనవి.. రాబోయో ఐదేళ్లకు ఈ ఎన్నికలు చాలా కీలకం అన్నారు.. గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి హమీలు నెరవేర్చలేదన్న ఆమె… ప్రజల మధ్య విభేదాలు సృష్టించడం తప్ప ప్రభుత్వం చేసింది ఏమీ లేదన్నారు.. అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు అని మండిపడ్డారు సోనియా గాంధీ.

Read Also: Mekapati Goutham Reddy Funeral: అంత్యక్రియల స్థలం మారింది..

రైతులు కష్టపడి పండించిన పంటకు కనీసం గిట్టుబాటు ధర లభించలేదని ఫైర్ అయ్యారు సోనియా గాంధీ.. ఎరువుల కొరతతో రైతులు ఇబ్బందులు పడ్డారని.. ఉత్తర్ ప్రదేశ్‌లోని యువత చాలా మంది విద్యావంతులయ్యారు.. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు.. కానీ, ప్రభుత్వం మాత్రం నిరుద్యోగ యువతను ఇంట్లో కూర్చోబెట్టిందని ఆరోపించారు.. రాష్ట్రంలో 12 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.. కానీ, వాటిని భర్తీ చేయలేదని దుయ్యబట్టారు సోనియా గాంధీ.. పెట్రోల్, డీజిల్ ధరలు తారాస్థాయికి చేరాయని.. సగటు మనిషికి ఇంటిని నిర్వహించడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు..“లాక్ డౌన్” లో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు.. వ్యాపారాలు మూతపడ్డాయి. చాలా మంది ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయారని తెలిపిన సోనియా గాంధీ..“లాక్ డౌన్” లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతారహితంగా వ్యవహరించాయని మండిపడ్డారు.. సమయం ఇవ్వకపోవటం వల్ల లక్షల మంది కార్మికులు కాలినడకన తమ స్వస్థలాలకు పోవాల్సి వచ్చిందని.. మోడీ, యోగీ ప్రభుత్వాలు అన్ని వర్గాలకు అన్యాయం చేశాయన్నారు.. “కరోనా” కారణంగా ఎంతో మంది జీవితాలు అతాలకుతలం అయ్యాయి., వారిని కనీసం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.. కాంగ్రెస్‌ అభ్యర్థులకు ఓటువేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు సోనియా గాంధీ.

Exit mobile version