Sonia Gandhi: మోడీ, యోగీ ప్రభుత్వాలతో అన్ని వర్గాలకు అన్యాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్, యోగి ఆదిత్యానాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ సర్కార్‌పై విరుచుకుపడ్డారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా “వీడియో కాన్ఫరెన్స్ ” లో ఓటర్లతో మాట్లాడిన ఆమె.. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు చాలా కీలకమైనవి.. రాబోయో ఐదేళ్లకు ఈ ఎన్నికలు చాలా కీలకం అన్నారు.. గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి హమీలు నెరవేర్చలేదన్న ఆమె… ప్రజల మధ్య విభేదాలు సృష్టించడం తప్ప ప్రభుత్వం చేసింది ఏమీ లేదన్నారు.. అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు అని మండిపడ్డారు సోనియా గాంధీ.
Read Also: Mekapati Goutham Reddy Funeral: అంత్యక్రియల స్థలం మారింది..
Also Read
- Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ చీఫ్ న్యూయార్క్ ఈవెంట్.. మమ్దానీపై యూఎస్ సింగర్ ఘాటు వ్యాఖ్యలు..
- Kriti Sanon: రాహుల్‌గాంధీ-కంగనా మాటల యుద్ధం.. కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ తొలగింపు
- TMC Rebel MPs: 20 మంది TMC రెబల్ ఎంపీలకు షాక్.. అనర్హత పిటిషన్‌పై స్పీకర్ కీలక చర్య
- Fake Cancer Drugs: క్యాన్సర్ బాధితుల ప్రాణాలతో చెలగాటం.. నీళ్లతో నింపిన నకిలీ ఇంజెక్షన్ల విక్రయం గుట్టురట్టు
రైతులు కష్టపడి పండించిన పంటకు కనీసం గిట్టుబాటు ధర లభించలేదని ఫైర్ అయ్యారు సోనియా గాంధీ.. ఎరువుల కొరతతో రైతులు ఇబ్బందులు పడ్డారని.. ఉత్తర్ ప్రదేశ్‌లోని యువత చాలా మంది విద్యావంతులయ్యారు.. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు.. కానీ, ప్రభుత్వం మాత్రం నిరుద్యోగ యువతను ఇంట్లో కూర్చోబెట్టిందని ఆరోపించారు.. రాష్ట్రంలో 12 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.. కానీ, వాటిని భర్తీ చేయలేదని దుయ్యబట్టారు సోనియా గాంధీ.. పెట్రోల్, డీజిల్ ధరలు తారాస్థాయికి చేరాయని.. సగటు మనిషికి ఇంటిని నిర్వహించడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు..“లాక్ డౌన్” లో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు.. వ్యాపారాలు మూతపడ్డాయి. చాలా మంది ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయారని తెలిపిన సోనియా గాంధీ..“లాక్ డౌన్” లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతారహితంగా వ్యవహరించాయని మండిపడ్డారు.. సమయం ఇవ్వకపోవటం వల్ల లక్షల మంది కార్మికులు కాలినడకన తమ స్వస్థలాలకు పోవాల్సి వచ్చిందని.. మోడీ, యోగీ ప్రభుత్వాలు అన్ని వర్గాలకు అన్యాయం చేశాయన్నారు.. “కరోనా” కారణంగా ఎంతో మంది జీవితాలు అతాలకుతలం అయ్యాయి., వారిని కనీసం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.. కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటువేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు సోనియా గాంధీ.
తాజావార్తలు
-
Success Story: ఆ ఒక్క నిర్ణయం అతని జీవితాన్నే మార్చేసింది.. IT జాబ్ వదిలి మష్రూమ్ బిజినెస్‌తో లక్షలు!
-
Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ చీఫ్ న్యూయార్క్ ఈవెంట్.. మమ్దానీపై యూఎస్ సింగర్ ఘాటు వ్యాఖ్యలు..
-
Kriti Sanon: రాహుల్‌గాంధీ-కంగనా మాటల యుద్ధం.. కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ తొలగింపు
-
Konda Murali : కాంగ్రెస్‌ను వీడేది లేదు, వివాదంతో నాకు సంబంధం లేదు.. కొండా మురళి సంచలనం
-
Yash’s Toxic: యశ్‌కి అగ్నిపరీక్ష.. ‘టాక్సిక్’ ముందు ఏకంగా రూ.1000 కోట్ల టార్గెట్!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..