Sonam Wangchuk: “నేపాల్‌లో జరిగినట్లే భారత్‌లో కూడా”.. ‘కాక్రోచ్’ ఉద్యమంపై సోనం వాంగ్‌చుక్ హెచ్చరిక
- కాక్రోచ్ ఉద్యమానికి సోనమ్ వాంగ్‌చుక్ మద్దతు..
- అడ్డుకుంటే నేపాల్ తరహా ఉద్యమంగా మారే ఛాన్స్..
- అణిచివేతపై ప్రభుత్వానికి వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sonam Wangchuk: ‘‘కాక్రోచ్ జనతా పార్టీ’’ దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది. దీనిపై ఎన్ని ఆరోపణలు ఉన్నా కూడా ప్రజలలో ఒక చర్చకు దారి తీసింది. ఇదిలా ఉంటే, ప్రముఖ పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్‌చుక్ శనివారం తనను తాను ‘‘గౌరవ బొద్ధింక’’గా అభివర్ణించుకున్నారు. కాక్రోచ్ జనతా పార్టీకి తన మద్దతు ప్రకటించారు. ఇది యువతలో భావప్రకటనా స్వేచ్ఛను సూచిస్తుందని, అణిచివేయకుండా వారి అసంతృప్తిని వినాలని ప్రభుత్వాన్ని కోరారు.
నిరుద్యో్గం, పరీక్ష పత్రాల లీకులు, జవాబుదారీతనం వంటి సమస్యలపై యువతలో నెలకొన్న అసంతృప్తి ఈ ప్రచారం ఒక క్రియేటివిటీ, ప్రజస్వామ్య వ్యక్తీకరణ అని ఆయన అన్నారు. ఈ ఉద్యమానికి తాను ముగ్ధుడినయ్యానని అన్నారు. ఈ ఉద్యమంలో తాను చేరనని, ఇది నిరుద్యోగి, సోమరులకు సరిపోతాయని తనకు ఆ అర్హతలు లేవని వాంగ్‌చుక్ అన్నారు. నేను ఇందులో సభ్యుడిని కానని, కానీ ఒక గౌరవనీయ బొద్ధింక అని అభివర్ణించుకున్నారు.
Also Read
- Putin Car: బుల్లెట్లు, బాంబులు ఏం చేయలేవు.. పుతిన్ ‘‘ఆరస్ సెనాట్’’ కారు ప్రత్యేకతలు ఇవే..
- సొంతిల్లు లేని వారికి గుడ్‌న్యూస్.. రూ.8 లక్షల రుణాలపై 4% సబ్సిడీ.. PMAY-U 2.0 పథకం పూర్తి వివరాలు ఇవే..
- Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
- S. Jaishankar: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తీవ్ర అనిశ్చితి.. బ్రిక్స్ దేశాలకు జైశంకర్ కీలక సందేశం
ఈ ఉద్యమాన్ని రాజకీయ వ్యంగ్యంతో ఆయన పోల్చారు. ఈ ఉద్యమానికి అహింసా స్వభావం ఉందని, యువత ఘర్షణకు బదులుగా క్రియేటివిటీని ఎంచుకుందని చెప్పారు. ఇతర దేశాల్లో జరిగినట్లు వీధుల్లోకి రాళ్లతో కాకుండా, భారత యువత క్రియేటివిటీని మార్గంగా ఎంచుకోవడం తనను ఆకట్టుకుందని చెప్పారు. దీనిని గౌరవించడం, ప్రేమగా చూడటం భారత ప్రభుత్వం కర్తవ్యం అని అన్నారు.
మరోవైపు, ఈ కాక్రోచ్ జనతా పార్టీకి చెందిన సోషల్ మీడియా అకౌంట్లను క్లోజ్ చేయడం, హ్యాక్ చేయడాన్ని ప్రస్తావిస్తూ.. ఇలా యువత అసమ్మతిని మూసివేయడం మంచిది కాదని హెచ్చరించారు. నేపాల్‌లో ఇలాగే భావప్రకటనా స్వేచ్ఛను అణిచివేయడం వల్లే ఊహించని పరిణామాలు సంభవించాయని అన్నారు. నేపాల్‌లో ఇంటర్నెట్ మూసేయడం, క్రియేటివిటీని అడ్డుకోవడంతోనే అల్లర్లు జరిగాయని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Smart Watches: AMOLED డిస్ప్లే, రఫ్ అండ్ టఫ్ లుక్.. తక్కువ ధరల్లో స్మార్ట్‌వాచ్‌లు అందుబాటులోకి..
-
Saudi-Trump: హౌతీలపై దాడులు చేయాలని ట్రంప్‌కు సౌదీ విజ్ఞప్తి.. అధ్యక్షుడు షాకింగ్ రియాక్షన్
-
Putin Car: బుల్లెట్లు, బాంబులు ఏం చేయలేవు.. పుతిన్ ‘‘ఆరస్ సెనాట్’’ కారు ప్రత్యేకతలు ఇవే..
-
Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్‌బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..
-
UPI Tap & Pay and MyUPI: సరి కొత్త ఫీచర్లు.. QR స్కాన్, పిన్ ఎంట్రీకి గుడ్‌బై.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్..!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?