CJP: పార్లమెంట్ మార్చ్.. కాక్రోచ్ జనతా పార్టీ సంచలన ప్రకటన..

  • కాక్రోచ్ జనతా పార్టీ సంచలన ప్రకటన..
  • జూలై 20న పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు..
Cjp

Cjp

CJP: ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద గత 20 రోజులుగా నిరసన తెలుపుతున్న కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. జూలై 20న పార్లమెంట్ వరకు శాంతియుత పాదయాత్రకు పిలుపునిచ్చింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలి రోజే ఈ మార్చ్ చేపట్టనున్నట్లు వెల్లడించింది. పేపర్ లీక్‌లకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇదే డిమాండ్‌తో పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ కూడా జూన్ 28 నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. జూలై 20న ప్రకటించిన పార్లమెంట్ పాదయాత్రలో పాల్గొంటారని సీజేపీ వెల్లడించింది.

జూలై 20న జరగబోయే శాంతియుత పార్లమెంట్ పాదయాత్రలో పాల్గొనాలని సోనమ్ వాంగ్‌చుక్ దేశ ప్రజలకు సోషల్ మీడియా ద్వారా పిలుపునిచ్చారు. తన నిరాహారదీక్షను విరమించాలని సోషల్ మీడియాలో స్పందిస్తున్న వారికి ధన్యవాదాలు తెలిపారు. అయితే, ఇలా మెసేజ్ చేయడం వల్ల ప్రయోజనం లేదని, పార్లమెంట్ మార్చ్‌లో పాల్గొనాలని కోరారు. పేపర్ లీక్, లడఖ్ పర్యావరణ పరిరక్షణ, దేశ భవిష్యత్తుకు సంబంధించిన అంశాలపై పార్లమెంట్‌లో చర్చించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.