NTV Telugu Site icon

Madhya Pradesh: వీడు కొడుకా..కసాయా..? స్మార్ట్ ఫోన్ కోసం కన్నతల్లినే..

Madhya Pradesh

Madhya Pradesh

Son beats mother with stick for not giving him money for smartphone: మానవ మనుగడను మొబైల్ విప్లవం బాగా మార్చేంది. అరచేతిలోకి ప్రపంచం వచ్చింది. ఇంటి నుంచే అన్ని పనులు జరిగిపోతున్నాయి. అయితే దీన్ని సరైన రీతిలో ఉపయోగించుకుంటే మరింతగా మానవ జీవితం మారుతుంది. కానీ ఇటీవల కాలంలో మొబైల్ ఫోన్లే పచ్చని సంసారాల్లో చిచ్చుపెడుతున్నాయి. సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలలో పరిచయం అయ్యే వారితో సంబంధాలను నెరుపుతూ భార్యాభర్తల బంధాన్ని విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. కొంతమంది మొబైల్ ఫోన్లకు బానిసలుగా మారుతున్నారు.

Read Also: Russia: రష్యా అమ్ములపొదిలో అధునాతన క్షిపణి.. ప్రపంచంలో దీనికి సాటి లేదన్న పుతిన్

ఇదిలా ఉంటే తాజాగా స్మార్ట్ ఫోన్ కోసం డబ్బులు ఇవ్వలేదని కన్న కొడుకే కసాయిగా మారాడు. కన్నతల్లి అని చూడకుండా చితకబాదాడు. నవమాసాలు మోసిన తల్లి కన్నా స్మార్ట్ ఫోన్ ఎక్కువ అయింది. మద్యప్రదేశ్ లోని చింద్వారాలో స్మార్ట్‌ఫోన్ కొనడానికి తగినంత డబ్బు ఇవ్వలేదని ఒక కుమారుడు తన తల్లిని కర్రతో కొట్టాడు. బద్కుహి చౌకీ ప్రాంతంలోని దర్బాయి గ్రామంలో సెల్ ఫోన్ కొనేందుకు వినోద్ అనే వ్యక్తి తల్లిని ర. 25,000 కోరాడు. అయితే తల్లి ఫూల్వతి అతనికి రూ.15,000 ఇచ్చింది. దీంతో కోపంతో వినోద్ తన తల్లిని కర్రలతో కొట్టాడు. గాయాలపాలైన మహిళను ఆస్పత్రికి తరలించారు. తన భార్యను తన కొడుకు దారుణంగా కొట్టాడని వినోద్ తండ్రి రమేష్ యాదవ్ తెలిపారు. అయితే ఈ విషయమై ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయలేదు.