Heavy Snowfall: జమ్మూ కశ్మీర్‌లో మంచు భారీగా కురుస్తుంది. దీని ప్రభావం జనవరి 2 వరకు ఉంటుందని, కొన్ని కొండ ప్రాంతాలు, మైదాన ప్రాంతాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. అలాగే, జనవరి 3, 6 తేదీల మధ్య కశ్మీర్ డివిజన్‌లోని కొన్ని ప్రాంతాలలో భారీ హిమపాతం కురిసే ఛాన్స్ ఉందన్నారు. దీంతో జమ్మూ డివిజన్‌లోని అనేక ప్రాంతాలపై ప్రభావితం చూపిస్తుంది. కాగా, ఆదివారం నాడు అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మంచు కురిసింది. ఆ క్రమంలో హిమపాతం తొలగింపుతో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. అలాగే, నిలిచిన వాహనాలను గమ్యస్థానాలకు చేరుకుంటున్నాయి. బనిహాల్, ఖాజిగుండ్ మధ్య రోడ్లు జారడంతో డ్రైవర్లు నెమ్మదిగా నడపాలని పోలీసులు సూచిస్తున్నారు.
Read Also: CM Chandrababu: రియల్ టైం గవర్నెన్స్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష!
ఇక, సోన్‌మార్గ్-కార్గిల్ రోడ్, భదేర్వా-చంబా రోడ్, సింథాన్ రోడ్‌తో పాటు జిల్లా రాజోరి, పూంచ్ నుంచి షోపియాన్ కలిపే మొఘల్ రోడ్‌లు ఇంకా హిమపాతంతోనే ఉండిపోయాయి. వాతావరణం మెరుగుపడిన తర్వాత శ్రీనగర్లోని అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో విమాన కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతాయి. పర్యాటకులు, ప్రయాణికులు ట్రాఫిక్ పోలీసుల సలహా ప్రకారం ముందుకు సాగాలని సూచించారు. అలాగే నేటి నుంచి రైలు సర్వీసులను కూడా పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే, ఈ రోజు విస్టాడోమ్ సేవలను క్యాన్సిల్ చేశారు.
Read Also: S. Jaishankar: నేటి నుంచి మూడు రోజులు ఖతార్లో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
కాగా, భారీగా మంచు కురిస్తుండటంతో ఈరోజు (డిసెంబర్30) జరగాల్సిన కాశ్మీర్ యూనివర్సిటీ పరీక్షలన్నీ వాయిదా పడ్డాయి. కాశ్మీర్‌లోని చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా ఉత్తర, దక్షిణ ప్రాంతాలలో విపరీతమైన హిమపాతం కురుస్తుండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూనివర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ మజిద్ జమాన్ వెల్లడించారు. ఎగ్జామ్స్ సకాలంలో నిర్వహిస్తాం.. వాయిదా పడిన పరీక్షలకు కొత్త తేదీలు మరోసారి విడుదల చేస్తామని తెలిపారు.
VIDEO | Heavy snowfall witnessed in Jammu and Kashmir's Patnitop.
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/3g9B5Q2Chj
— Press Trust of India (@PTI_News) December 29, 2024