NTV Telugu Site icon

Chennai: చెన్నై ఎయిర్‌పోర్టులో పాముల కలకలం..

Chennai

Chennai

Chennai: చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా కౌలాలంపూర్ నుంచి వచ్చి ఓ ప్రయాణికురాలి వద్ద ఏకంగా 22 పాములను గుర్తించారు. లగేజ్ బ్యాగుల్ని తనిఖీ చేస్తున్న క్రమంలో విషపూరితమైన పాములను అధికారులు గుర్తించారు. వీటిలో రకరకాల పాములు ఉన్నాయి. 10 అడుగులకు పొడవైన పాములను గుర్తించారు కస్టమ్స్ అధికారులు.

Read Also: Drug-Resistant Bacteria: షాకింగ్ స్టడీ.. ప్రాణాంతక బ్యాక్టీరియాను మోసుకొస్తున్న మేఘాలు..

చెక్ ఇన్ సమయంలో పాములతో ఉన్న ప్లాస్టిక్ కంటైనర్లను తనిఖీ చేయగా అందులో పాములు బయటపడ్డాయి. వీటిలో బ్యాగు నుంచి ఊసరవెల్లిని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ రోజు మలేషియా కౌలాలంపూర్ నుంచి వచ్చిన మహిళా ప్రయాణికురాలి వద్ద 22 రకాల పాములను గుర్తించినట్లు, మహిళను అరెస్ట్ చేసినట్లు చెన్నై కస్టమ్స్ ట్వీట్ చేసింది. 1962 r/w వన్యప్రాణుల రక్షణ చట్టం, 1972 ప్రకారం కేసు నమోదు చేశారు. కస్టమ్స్ అధికారులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చి వాటిని అక్కడ నుంచి తరలించారు.

ఈ ఏడాది జనవరి నెలలో కూడా ఇలాగే చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో పాములు, కోతులు, తాబేళ్లు ఉన్న కంటైనర్లను అధికారులు పట్టుకున్నారు. ఫైథాన్, చుక్కల తాబేళ్లు, 8 కార్న్ పాములను పట్టుకున్నారు. బ్యాంకాంగ్ నుంచి నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి వీటిని స్వాధీనం చేసుకున్నారు.

Show comments