NTV Telugu Site icon

Smriti Irani: కాంగ్రెస్ హిందూ ద్వేషి, బీజేపీ అధికారంలోకి వస్తుంది.. స్పృతి ఇరానీ జోస్యం

Smriti Irani

Smriti Irani

Smriti Irani On Karnataka Elections: భజరంగ్ దళ్, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాలను నిషేధిస్తామని పేర్కొన్న కాంగ్రెస్‌ను ‘హిందూ ద్వేషి’ పార్టీగా కేంద్రమంత్రి స్పృతి ఇరానీ అభివర్ణించారు. భజరంగ్ దళ్‌ని నిషేధిస్తామని కాంగ్రెస్ బెదిరింపుల్ని ప్రస్తావిస్తూ.. ఏ ప్రత్యర్థినైనా బీజేపీ తిప్పికొడుతుందని, ఆయా పార్టీలు దాడి చేసేదాకా బీజేపీ చూస్తూ ఉండదని హెచ్చరించారు. అంతేకాదు.. కర్ణాటక ఎన్నికల్లో తమ బీజేపీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని జోస్యం కూడా చెప్పారు. ‘‘కాంగ్రెస్ ఒక హిందూ ద్వేషి పార్టీ. వారి మెనిఫెస్టోనే ఆ విషయాన్ని ధృవీకరిస్తుంది. హిందూ ఆర్గనైజేషన్‌ను కాంగ్రెస్ ఉగ్రవాద సంస్థతో పోలుస్తోంది. వారు ఏ మతపరమైన, సామాజిక-రాజకీయ విశ్వాసాలను కలిగి ఉన్నారో ఇది అద్దం పడుతుంది’’ అంటూ చెప్పుకొచ్చారు.

Prasanth Varma: ‘హను-మాన్’ వాయిదా, త్వరలో కొత్త విడుదల తేదీ!

పీఎఫ్ఐపై ఉగ్రవాద ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. కొన్ని రాష్ట్రాల్లో ఆ సంస్థను బ్యాన్ చేశారు. ఈ నేపథ్యంలోనే తాము పీఎఫ్ఐతో పాటు భజరంగ్ దళ్‌ని కూడా నిషేధిస్తామని కాంగ్రెస్ చేసిన ప్రకటన.. తీవ్ర దుమారానికి తెరలేపింది. దీనిపై స్పృతి మాట్లాడుతూ.. ‘జై బజరంగ్ బలి అని ఎవరో నినాదాలు చేస్తే, కాంగ్రెస్ ఎలక్షన్ కమిషన్‌కి వెళ్తుందా? వాళ్లు హిందూ దేవుళ్లను క్షమాపణ అడగగలరా? వారి మెనిఫెస్టో అబద్ధమా?’’ అని ప్రశ్నించారు. ఒకవైపు బజరంగ్ దళ్‌ని నిషేధిస్తామని చెప్తూనే, మరోవైపు జై బజరంగ్ బలి నినాదాలు చేస్తూ.. కాంగ్రెస్ గందరగోళానికి గురి చేస్తోందని అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బిజెపిపై దాడి చేసే వరకు వేచి ఉండలేమని.. ముందస్తుగా రక్షించడం రాజ్యాంగ హక్కు అని ఇరానీ అన్నారు.

Jammu Anti-Terror Op: జమ్ముకశ్మీర్‌లో ఎదురుకాల్పులు.. ఐదుగురు ఆర్మీ జవాన్లు మృతి

ఇక కర్ణాటకలో బీజేపీ సునాయాసంగా విజయం సాధిస్తుందని ఇరానీ ధీమా వ్యక్తం చేశారు. తాను జ్యోతిష్యురాలిని కాదని, కానీ కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ తప్పకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, దీనిపై తాను హామీ ఇస్తానని తెలిపారు. లేకపోతే.. హిందూ దేవుళ్ళను కించపరిచే కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు వారి ముందు సాష్టాంగ పడతారని మీరు అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు.