Site icon NTV Telugu

Smriti Irani: రాహుల్‌ని టార్గెట్‌ చేసిన స్మృతి ఇరానీ.. వీడియోతో కౌంటర్‌ ఇచ్చిన కాంగ్రెస్‌..

Smriti Irani

Smriti Irani

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కేంద్రంగా… కాంగ్రెస్‌, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. భారత్‌ జోడో యాత్రను ప్రారంభించిన రాహుల్ గాంధీ… స్వామి వివేకానంద విగ్రహాన్ని సందర్శించకుండా అగౌరవపర్చారంటూ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. భారత్‌ను ఏకం చేసేందుకు కన్యాకుమారి నుంచి యాత్ర ప్రారంభించిన రాహుల్‌.. స్వామి వివేకానందుడిని మర్చిపోవడం సిగ్గుగా అన్పించట్లేదా ? అంటూ మండిపడ్డారు. దీనిపై కాంగ్రెస్‌ పార్టీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. అయితే, స్మృతి ఇరానీ వ్యాఖ్యలను కాంగ్రెస్‌ పార్టీ తిప్పికొట్టింది.

Read Also: CM Ashok Gehlot: ‘టీషర్ట్’ విమర్శలకు కౌంటర్.. అమిత్ షా మఫ్లర్ సంగతేంటి?

నిజానికి జోడో యాత్రకు ముందు రాహుల్‌.. కన్యాకుమారిలోని వివేకానందుడి విగ్రహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆమె వీడియోకు.. రాహుల్‌ వివేకానందుడి విగ్రహానికి నమస్కరిస్తున్న వీడియోను జత చేసి కౌంటర్‌ ఇచ్చింది. అబద్ధాలను ప్రచారం చేయడంలో బీజేపీ ముందుంటుందన్న జైరాం రమేశ్‌ విమర్శించారు. స్మృతి ఇరానీకి మరింత స్పష్టంగా కనబడేందుకు కొత్త కళ్లద్దాలు కావాలంటే.. మేం కచ్చితంగా పంపిస్తామంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాగా,మొన్న రాహుల్‌ గాంధీ 41వేల రూపాయల టీషర్టు ధరించారంటూ ప్రచారం చేసింది. దీనికి కాంగ్రెస్‌ పార్టీ…ప్రధాని మోడీ 10 లక్షల విలువ చేసే సూట్లను ధరిస్తున్నారని… దీనికి సమాధానం చెప్పాలంటూ ప్రశ్నించారు. రాహుల్ గాంధీకి వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకే… బీజేపీ అనవసర ఆరోపణలు చేస్తోందంటూ కాంగ్రెస్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Exit mobile version