Ketan Agarwal Murder Case: పెళ్లే జరగదు.. అయినా టికెట్లు బుక్ చేయాలి: సియా స్నాప్‌చాట్ వైరల్
- కేతన్ అగర్వాల్ హత్య కేసులో కీలక మలుపు..
- వెలుగులోకి వచ్చిన సియా స్నాప్ చాట్ మెసేజ్‌లు..
- పెళ్లే జరగదు అంటూ స్నేహితురాలితో చాట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ketan Agarwal Murder Case: కేతన్ అగర్వాల్ హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో రోజుకో కొత్త అంశం వెలుగులోకి వస్తోంది. తాజాగా, సియా గోయల్ తన పెళ్లికి ముందు స్నేహితురాలితో చేసిన స్నాప్ చాట్ సంభాషణ వెలుగులోకి వచ్చింది. ఈ కేసును కొత్త మలుపు తిప్పేదిగా ఈ చాట్‌ను భావిస్తున్నారు. పూణేలోని లోహగడ్ కోట నుండి 26 ఏళ్ల కేతన్‌ను సియా (20), ఆమె ప్రియుడు చేతన్ చౌదరి (22) లోయలోకి తోసేశారని ఆరోపణలు రావడానికి సుమారు మూడు వారాల ముందు, మే 25న ఈ సంభాషణ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ చాట్‌లో, పెళ్లికి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయాల్సిన అవసరం ఉందని చెబుతూ సియా తన స్నేహితురాలి ఆధార్ కార్డ్ ముందు, వెనక పంపించాలని కోరుతుంది. ఇలా చెబుతూనే.. ‘‘జరగని పెళ్లి కోసం టికెట్లు బుక్ చేయాలి.. అయినా పంపు’’ అని అర్థం వచ్చేలా స్నేహితురాలితో చాట్ చేసినట్లు వెలుగులోకి వచ్చింది. దీనికి ప్రతిగా ఇప్పటికే వాట్సాప్‌లో పంపించినట్లు స్నేహితురాలు సమాధానం ఇస్తుంది. ఇప్పుడు ఈ చాట్ వైరల్‌గా మారింది. ముందుగానే పెళ్లిని ఆపేందుకు సియా పక్కా ప్లాన్‌లో ఉందనే అనుమానాలను మరింత బలపరిచాయి. అయితే, ఈ చాట్ ప్రామాణికతను పోలీసులు ప్రస్తుతం పరిశీలిస్తున్నారు.
Also Read
- Delhi Police Attack: షాకింగ్ ఘటన.. కర్రలు, ఇటుకలతో పోలీసులపై దాడి (వీడియో)
- Neha Pachisia: నేహా పచిసియా ఎవరు? ఎయిర్ హోస్టెస్ నుంచి పోలీస్ అధికారిణిగా.. ఇప్పుడు సస్పెన్షన్ ఎందుకు?
- Suitcase Torso Case: సూట్‌కేసులో మొండెం కేసులో కొత్త ట్విస్ట్.. శరీర భాగాలతో బిర్యానీ వండి..!
- Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ..
హత్య అనంతరం అనుమానాలు మళ్లించడానికి లేదా తప్పుడు కథనాలను సృష్టించడానికి ఒక పెద్ద ప్లాన్‌లో భాగంగా ఈ ఫ్లైట్ బుకింగ్స్ జరిగాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సియా ఫ్రెండ్‌కు ఆమె కుట్ర గురించి తెలుసో లేదో అనేది ఇంకా తెలియరాలేదు. ఇప్పటికే కేతన్ హత్య గురించి తెలిసిన మూడో వ్యక్తిని పోలీసులు గుర్తించారు. అతను చేతన్ క్లాస్మేట్ అని భావిస్తున్నారు.
కేతన్, సియాల ఎంగేజ్మెంట్ ఈ ఏడాది ఆరంభంలో జరిగింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో నవంబర్‌లో వీరిద్దరి వివాహం కావాల్సి ఉంది. ఈ పెళ్లికి హాజరయ్యే అతిథుల కోసం రెండు ప్రత్యేక విమానాలు కూడా బుక్ చేశారు. మరోవైపు సియా ఆమె లవర్ చేతన్‌లకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణల్లో కోడ్ వర్డ్స్ ఉపయోగించినట్లు, వారి ఫోన్లు పరిశీలించిన తర్వాత పోలీసులు గుర్తించారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Once More: సీరియస్ నుంచి స్వీట్ రొమాన్స్‌కు… అర్జున్ దాస్ – అదితి శంకర్ ‘వన్స్ మోర్’ ట్రైలర్ బ్లాస్ట్!
-
Mega Hero’s : మెగా మేనల్లుడికి షాక్ ఇచ్చిన మెగాస్టార్.. బరిలో ఉంటాడా?
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Delhi Police Attack: షాకింగ్ ఘటన.. కర్రలు, ఇటుకలతో పోలీసులపై దాడి (వీడియో)
ట్రెండింగ్
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!