SIR row: CEC జ్ఞానేశ్ కుమార్‌పై అభిశంసన తీర్మానం.!

  • సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై అభిశంసన తీర్మానం.!
  • తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు విపక్షాలు సిద్ధం..
Cec Gyanesh Kumar

Cec Gyanesh Kumar

SIR row:  చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)పై ముగ్గురు కమిషనర్లలో విభేదాలు వచ్చాయని ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించడంతో ఒక్కసారి రాజకీయ వాతావరణం వాడీవేడిగా మారింది. కాంగ్రెస్, టీఎంసీ, సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీ ఇలా ప్రతిపక్షాలు, ఆ పార్టీ నేతలు సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌‌పై విమర్శలు పెంచారు. బీజేపీకి సహకరించేలా ఓట్లు తొలగించారని ఆరోపిస్తున్నారు.

ఇదిలా ఉంటే, ఇప్పుడు ప్రతిపక్షాలు ఇండియా కూటమి జ్ఞానేశ్ కుమార్‌‌పై ‘‘అభిశంసన తీర్మానం’’ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. రెండు సభల్లో త్వరలోనే అభిశంసన తీర్మానానికి సంబంధించిన నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) జ్ఞానేశ్ కుమార్‌ 48 గంటల్లో రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. లేనిపక్షంలో ఢిల్లీలో పాటు దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని, నిరసనలు చేపడుతామని హెచ్చరించింది. బీజేపీకి సహకరించేలా సీఈసీ పనిచేశారని సీజేపీ కన్వీనర్ అభిజిత్ దీప్కే సంచలన ఆరోపణలు చేశారు.