యువతకు ఇష్టమైన నేత, పవర్ స్టార్‌గా పేరు గాంచిన భోజ్‌పురి గాయకుడు పవన్ సింగ్ తిరిగి బీజేపీ గూటికి చేరారు. 2024, మే నెలలో ఎన్డీఏ అభ్యర్థిపై స్వతంత్ర అభ్యర్థిగా కరకట్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ సమయంలో బీజేపీ నుంచి పవన్ సింగ్ బహిష్కరణకు గురయ్యారు. తాజాగా బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన తిరిగి సొంత గూటికి చేరడంతో మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేయొచ్చని తెలుస్తోంది.
ఈ సందర్భంగా పవన్ సింగ్ మాట్లాడుతూ.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని తెలిపారు. తాను బీజేపీకి నిజమైన సైనికుడినని చెప్పారు. పోటీ చేసే ఉద్దేశంతో బీజేపీలో చేరలేదని పేర్కొన్నారు. పార్టీ పట్ల విధేయత కలిగిన నేతగా చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Pakistan: పోలీస్ శిక్షణా కేంద్రంపై ఆత్మాహుతి దాడి.. ఆరుగురు పోలీసులు.. ఏడుగురు ఉగ్రవాదులు మృతి
ఇదిలా ఉంటే పవన్ సింగ్ భార్య జ్యోతి సింగ్ ఇటీవల ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను కలిశారు. జన్ సురాజ్ పార్టీ నుంచి పోటీ చేయొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం పవన్ సింగ్-జ్యోతి సింగ్ మధ్య వైవాహిక విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జ్యోతి సింగ్.. ప్రశాంత్ కిషోర్‌ను కలిసి తన గోడు వెళ్లబుచ్చుకుంది.
ఇది కూడా చదవండి: North Korea: చైనాకు ధీటుగా అణ్వాయుధ ప్రదర్శన.. బలాన్ని ప్రదర్శించిన కిమ్
బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు మాత్రం నవంబర్ 14న జరగనుంది. ఓ వైపు ఎన్డీఏ-ఇండియా కూటమిలు నువ్వానేనా? అన్నట్టుగా ఫైటింగ్ చేస్తుండగా.. ఇంకోవైపు ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ ఎన్నికల అరంగ్రేటంతో పోరాడుతున్నారు. అయితే ఈసారి ప్రజలు ఏ పార్టీకి అధికారం కట్టబెడతారో వేచి చూడాలి.
ఇది కూడా చదవండి: Laura Loomer: అమెరికాలో ముస్లింలు పదవులు చేపట్టకుండా చట్టం తీసుకురండి.. రిపబ్లికన్ నేత డిమాండ్
