NTV Telugu Site icon

MUDA land scam: ముడా స్కామ్‌లో భయపడేది లేదు.. కోర్టు ఆదేశంపై సిద్ధరామయ్య

Muda Land Scam

Muda Land Scam

MUDA land scam: మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్‌(ముడా) ల్యాండ్ స్కామ్‌లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. గతంలో గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఆయనపై విచారణకు ఆదేశాలు ఇవ్వడాన్ని సిద్ధరామయ్య కర్ణాటక హైకోర్టులో సవాల్ చేశారు. అయితే, సీఎం పిటిషన్‌ని నిన్న కర్ణాటక హైకోర్టు కోట్టేసింది. దీంతో విచారణకు మార్గం సుగమమైంది. ఇదిలా ఉంటే ట్రయల్ కోర్ట్ సీఎంపై కేసు నమోదు చేసి, విచారణ జరపాలని లోకాయుక్తాని ఈ రోజు ఆదేశించింది.

Read Also: Labanon: లైవ్‌లో ఉండగా జర్నలిస్టుపై పడ్డ ఇజ్రాయెల్ క్షిపణి.. వీడియో వైరల్

ఈ నేపథ్యంలో విచారణకు తాను భయపడబోయేది లేదని సిద్ధరామయ్య ఈ రోజు అన్నారు. “నేను దర్యాప్తును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని ఇదివరకే చెప్పాను. విచారణకు నేను భయపడను. నేను నిన్న ఈ విషయాన్ని చెప్పాను, ఈరోజు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాను. నేను న్యాయపోరాటానికి సిద్ధంగా ఉన్నాను” అని సీఎం మీడియా సమావేశంలో అన్నారు.

కర్ణాటకలో ముడా స్కామ్ అక్కడి రాజకీయాల్లో సంచలనంగా మారింది. సిద్ధరామయ్యతో పాటు ఆయన సతీమణి బీఎం పార్వతిపై అభియోగాలు ఉన్నాయి. మైసూర్ నగర అభివృద్ధి కోసం సేకరించిన భూమికి ప్రతిఫలంగా, అత్యంత విలువైన ప్రాంతంలో పార్వతికి 14 స్థలాల కేటాయింపు వివాదంగా మారింది. ఆమె ఇచ్చి భూమి కన్నా పరిహారంగా పొందిన భూమి విలువు ఎక్కువ అని ఆర్టీఐ యాక్టివిస్టులు గవర్నర్‌కి ఫిర్యాదు చేయడంతో, విచారణకు ఆదేశాలు ఇచ్చారు.