NTV Telugu Site icon

BJP: టెర్రరిస్టులకు సపోర్ట్ చేసే కాంగ్రెస్ ఇలాగే మాట్లాడుతుంది.. ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్..

Kharge

Kharge

BJP: ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్‌ని ఉద్దేశిస్తూ ఇటీవల కాంగ్రెస్‌ని ‘‘అర్బన్ నక్సల్స్’’ నడిపిస్తున్నారంటూ విమర్శించారు. ప్రధాని మోడీని వ్యాఖ్యల్ని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తప్పుపట్టారు. బీజేపీ ‘‘టెర్రరిస్టుల పార్టీ’’గా విమర్శించారు. దీంతో ఇరు పార్టీల మధ్య వివాదం మొదలైంది. బీజేపీ ప్రజల్ని కొట్టి చంపడం, గిరిజనులు-దళితులపై దౌర్జన్యాలకు పాల్పడుతుందని కాంగ్రెస్ అధ్యక్షుడు అన్నారు. ‘‘వారు కొంత కాలం నిశ్శబ్దంగా ఉన్నారు. మళ్లీ హర్యానా విజయం తర్వాత మాట్లాడటం ప్రారంభించారు. వారు మేధావులు, ప్రగతిశీల వ్యక్తుల్ని అర్బన్ నక్సల్స్‌గా పిలుస్తారు. వారు ప్రజల్ని కొట్టి చంపుతారు. షెడ్యూల్డ్ కులాలకు చెందిన వ్యక్తుల నోటిలో మూత్ర విసర్జన చేస్తారు.’’ అని ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read Also: US Presidential Elections: అమెరికా అధ్యక్షుడుని గెలిపించేవి ఈ 7 స్వింగ్ స్టేట్స్.. ట్రంప్, కమలా హారిస్ మధ్య టైట్ ఫైట్..

అయితే, ఖర్గే విమర్శలపై బీజేపీ ఘాటుగానే స్పందిస్తోంది. కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ.. ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చే వారు, వేరేవారికి ఈ విషయాన్ని చెబుతున్నారు అని అన్నారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పునావాలా మాట్లాడుతూ.. కాంగ్రెస్ అత్యంత దళిత వ్యతిరేక పార్టీ అని అన్నారు. ప్రజల్ని అవమానించడమే కాంగ్రెస్ గుర్తింపు అని, 2014, 2019, 2024లో ప్రజలు బీజేపీకి ఓటేశారని గుర్తు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ డీఎన్ఏని తెలియజేస్తాయని పూనావాలా అన్నారు. కాంగ్రెస్ దళితుల గురించి మాట్లాడుతోంది.. హర్యానాలో కుమారి సెల్జాకి వారు ఏం చేశారు అంతా చూశారని, కర్ణాటకలో దళితుల కోసం ఉద్దేశించిన నిధుల్ని దోచుకున్నారని విమర్శించారు.

బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ మాట్లాడుతూ.. ఉగ్రవాదాన్ని, అవినీతిని ఏమాత్రం సహించని ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే అది బీజేపీనే అని అన్నారు. జమ్మూ కాశ్మీర్‌లో రాళ్లదాడిని అంతమొందించామని, ముంబైలాంటి టెర్రర్ అటాక్ ఎందుకు జరగలేదని కాంగ్రెస్ తమను తాము ప్రశ్నించుకోవాలని అన్నారు. కాంగ్రెస్ యూపీఏ హయాంలో నిత్యం బాంబు పేలుళ్లు జరిగేవని గుర్తు చేశారు.