CM Nitish Kumar: “హిందీ తెలిసి ఉండాలి”.. ఇండియా కూటమి సమావేశంలో డీఎంకే నేతపై ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Nitish Kumar: ఇటీవల కాలంలో హిందీ భాష వివాదాస్పదమవుతోంది. ముఖ్యంగా తమిళనాడు నాయకులు ఈ వివాదాన్ని రేకెత్తిస్తున్నారు. అధికార డీఎంకే పార్టీ నాయకులు హిందీ భాషను తమపై రుద్దొద్దంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవల గోవాల ఎయిర్ పోర్టులో ఓ తమిళ మహిళకి హిందీ రాకపోవడంపై అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది అవహేనగా మాట్లాడారంటూ.. ఏకంగా సీఎం స్టాలిన్ తప్పుబట్టారు. కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదిలా ఉంటే మంగళవారం ఇండియా కూటమి సమావేశంలో హిందీపై వివాదం చెలరేగింది. జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి సీఎం నితీష్ కుమార్ సమావేశంలో గంట పాటు మాట్లాడారు. అయితే ఈ సమావేశంలో పాల్గొన్న డీఎంకే నాయకుడు టీఆర్ బాలు, హిందీలో చేసిన ప్రసంగాన్ని అనువాదం చేయాలని కోరడంతో అంతా నిశ్చేష్టులయ్యారు.
Also Read
- Bihar: 1992 నాటి కేసు.. 34 ఏళ్ల తర్వాత తీర్పు.. 84 ఏళ్ల వృద్ధుడిని దోషిగా తేల్చిన కోర్టు
- Congress: సంచలన నిర్ణయాలు దిశగా కాంగ్రెస్.. భారీ నాయకత్వ మార్పుల వైపు అడుగులు?
- Lalit Modi: 'ఆమె డబ్బు కోసం ఆశపడేది కాదు', సుష్మితా సేన్‌తో తన బ్రేకప్‌పై మౌనం వీడిన లలిత్ మోడీ..
- Sonam Bail Cancellation: రాజా రఘువంశీ హత్య కేసు.. బెయిల్ పై సోనమ్.. మేఘాలయ ప్రభుత్వం కీలక నిర్ణయం
Read Also: Velampalli Srinivasa Rao: సీఎంవోకు వెల్లంపల్లి శ్రీనివాస్.. సీటు మార్పు వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు
ఈ సమావేశంలో డీఎంకే తరుపున తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌తో పాటు టీఆర్ బాలు పాల్గొన్నారు. సమావేశంలో నేతలను ఉద్దేశించి సీఎం నితీష్ కుమార్ మాట్లాడారు. అయితే అతను ఏం మాట్లాడుతున్నారో అర్థం చేసుకోలేక, టీఆర్ బాలు ప్రసంగాన్ని అనువదించాలని ఎదురుగా కూర్చున్న ఆర్జేడీ రాజ్యసభ ఎంపీ మనోజ్ కే. ఝాకు కోరారు.
మనోజ్ ఝా నితీష్ కుమార్ నుంచి అనుమతి కోరగా.. ‘‘ మనం మన దేశాన్ని హిందూస్తాన్ అని పిలుస్తాము.. హిందీ మన జాతీయ భాష, మనకు హిందీ తెలియాలి’’ అని అన్నారు. నితీష్ కుమార్ తన ప్రసంగాన్ని అనువద్దించవద్దని మనోజ్ ఝాను కోరారు. రాబోయే 2024 లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపకం, ప్రచార వ్యూహాలను చర్చించేందుకు మంగళవారం ఢిల్లీలో ఇండియా కూటమి 4వ సమావేశం జరిగింది.
తాజావార్తలు
-
RUPEE vs DOLLAR: క్షణాల్లో ఫుడ్ బుక్ చేసుకోకపోతే పస్తులుండాల్సిందే.. విదేశాల్లో దయనీయ దుస్థితిలో భారతీయ విద్యార్థులు.. కారణాలు ఇవే!
-
Bihar: 1992 నాటి కేసు.. 34 ఏళ్ల తర్వాత తీర్పు.. 84 ఏళ్ల వృద్ధుడిని దోషిగా తేల్చిన కోర్టు
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
Psychology Facts: ప్రతి పనికీ 10నిమిషాలు ముందుగా వచ్చే వ్యక్తులు గురించి షాకింగ్ ఫ్యాక్ట్.. తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు!
-
Nikhil : స్వయంభు కోసం 45 రోజుల కఠినమైన శిక్షణ తీసుకున్న హీరో నిఖిల్
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!