NTV Telugu Site icon

CM Nitish Kumar: “హిందీ తెలిసి ఉండాలి”.. ఇండియా కూటమి సమావేశంలో డీఎంకే నేతపై ఆగ్రహం..

India Bloc

India Bloc

CM Nitish Kumar: ఇటీవల కాలంలో హిందీ భాష వివాదాస్పదమవుతోంది. ముఖ్యంగా తమిళనాడు నాయకులు ఈ వివాదాన్ని రేకెత్తిస్తున్నారు. అధికార డీఎంకే పార్టీ నాయకులు హిందీ భాషను తమపై రుద్దొద్దంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవల గోవాల ఎయిర్ పోర్టులో ఓ తమిళ మహిళకి హిందీ రాకపోవడంపై అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది అవహేనగా మాట్లాడారంటూ.. ఏకంగా సీఎం స్టాలిన్ తప్పుబట్టారు. కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇదిలా ఉంటే మంగళవారం ఇండియా కూటమి సమావేశంలో హిందీపై వివాదం చెలరేగింది. జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి సీఎం నితీష్ కుమార్ సమావేశంలో గంట పాటు మాట్లాడారు. అయితే ఈ సమావేశంలో పాల్గొన్న డీఎంకే నాయకుడు టీఆర్ బాలు, హిందీలో చేసిన ప్రసంగాన్ని అనువాదం చేయాలని కోరడంతో అంతా నిశ్చేష్టులయ్యారు.

Read Also: Velampalli Srinivasa Rao: సీఎంవోకు వెల్లంపల్లి శ్రీనివాస్‌.. సీటు మార్పు వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు

ఈ సమావేశంలో డీఎంకే తరుపున తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌తో పాటు టీఆర్ బాలు పాల్గొన్నారు. సమావేశంలో నేతలను ఉద్దేశించి సీఎం నితీష్ కుమార్ మాట్లాడారు. అయితే అతను ఏం మాట్లాడుతున్నారో అర్థం చేసుకోలేక, టీఆర్ బాలు ప్రసంగాన్ని అనువదించాలని ఎదురుగా కూర్చున్న ఆర్జేడీ రాజ్యసభ ఎంపీ మనోజ్ కే. ఝాకు కోరారు.

మనోజ్ ఝా నితీష్ కుమార్ నుంచి అనుమతి కోరగా.. ‘‘ మనం మన దేశాన్ని హిందూస్తాన్ అని పిలుస్తాము.. హిందీ మన జాతీయ భాష, మనకు హిందీ తెలియాలి’’ అని అన్నారు. నితీష్ కుమార్ తన ప్రసంగాన్ని అనువద్దించవద్దని మనోజ్ ఝాను కోరారు. రాబోయే 2024 లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపకం, ప్రచార వ్యూహాలను చర్చించేందుకు మంగళవారం ఢిల్లీలో ఇండియా కూటమి 4వ సమావేశం జరిగింది.

Show comments