NTV Telugu Site icon

Shashi Tharoor: దేశ రాజధానిగా ఢిల్లీని ఇంకా కొనసాగించాలా..?

Shashitaroor

Shashitaroor

Shashi Tharoor: దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం క్రమంలో పెరిగిపోతుంది. దీనికి తోడు పొగ మంచు కప్పేయడంతో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అత్యంత తీవ్ర స్థాయికి పడిపోతుంది. ఈ రోజు (మంగళవారం) ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఏక్యూఐ 500 మార్క్ ను తాకింది. దీనిపై తాజాగా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ రియాక్ట్ అయ్యారు.. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీని దేశ రాజధానిగా కొనసాగాల్సి ఉందా అని క్వశ్చన్ చేశారు.

Read Also: Russia-Ukraine War: నేటితో 1,000వ రోజుకు చేరిన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం

అయితే, కాలుష్య నగరాల జాబితా గణాంకాలకు సంబంధించి ఓ టేబుల్‌ను కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ రిలీజ్ చేశారు. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ మారిపోగా.. ఇక్కడ ప్రమాదకర కాలుష్య కారకాలు నాలుగు రెట్లు పెరిగాయన్నారు. అలాగే, రెండో అత్యంత కాలుష్య నగరం ఢాకా ( బంగ్లాదేశ్ రాజధాని ) పోలిస్తే ఢిల్లీలో ప్రమాద స్థాయి 5 రెట్లు ఎక్కువగానే ఉందని ఆరోపించారు. ఇలాంటి విపత్కర పరిస్థితిని మనం గత కొన్నేళ్లుగా చూస్తున్నాం.. దీనిపై కేంద్ర ప్రభుత్వం మాత్రం పట్టించుకోవట్లేదు అని పోస్ట్ చేశారు. నవంబర్ నుంచి జనవరి మధ్య ఈ నగరం నివాసయోగ్యంగానే ఉండటం లేదని విమర్శించారు. మిగతా సమయాల్లోనూ అంతంత మాత్రంగానే జీవనం కొనసాగించగలం అని చెప్పుకొచ్చారు. ఇలాంటి పరిణామాల మధ్య ఇంకా ఢిల్లీని దేశ రాజధానిగా కొనసాగించాలా? అని ఎంపీ శశిథరూర్ ఎక్స్ (ట్విట్టర్)లో రాసుకొచ్చారు.