Site icon NTV Telugu

Madhya Pradesh: శివరాజ్‘రాజ్’సింగ్‌దే మధ్యప్రదేశ్.. మళ్లీ కమలానిదే హవా..

Shiraj Singh Chauhan

Shiraj Singh Chauhan

Madhya Pradesh: సింగ్ ఈస్ కింగ్.. మరోసారి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో శివ”రాజ్”సింగ్ పాలనే కొనసాగుతుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఇండియా టుడే, ఇండియా టీవీ, రిపబ్లిక్ టీవీ వంటివి బీజేపీనే గెలుస్తుందని చెబుతున్నాయి. ఇదిలా ఉంటే మరికొన్ని సంస్థలు మాత్రం బీజేపీ కన్నా స్వల్పంగా కాంగ్రెస్ కొన్ని స్థానాలను సాధిస్తుందంటూ అంచనా వేస్తున్నాయి. ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ప్రకారం.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి 47 శాతం ఓట్లతో అధికారాన్ని నిలుపుకునే అవకాశం ఉందని అంచనా వేశాయి. 41 శాతం ఓట్లను కాంగ్రెస్ తెచ్చుకుంటుందని తెలిపింది.

Read Also: Revanth Reddy: ఎగ్జిట్ పోల్స్ నిజమైతే కేటీఆర్ క్షమాపణ చెబుతారా?

230 అసెంబ్లీ స్థానాలు ఉన్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీకి 140-162 సీట్లలో అధికారంలోకి వస్తుందని ఇండియా టుడే మై ఇండియా ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. మరోవైపు కాంగ్రెస్ 68 నుంచి 90 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్ లోని భోపాల్, నిమార్ ,బుందేల్ ఖండ్, చంబర్ వంటి ప్రాంతాల్లో కాంగ్రెస్‌తో పోలిస్తే బీజేపీకి మెజారిటీ సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది.

క్లీన్ ఇమేజ్ ఉన్న బీజేపీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. 36 శాతం మంది ఆయనకు అనుకూలంగా ఉన్నారు, కాంగ్రెస్ సీఎం అభ్యర్థి కమల్‌నాథ్ కి 30 శాతం మంది అనుకూలంగా ఉన్నారు. మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోడీ ఛర్మష్మా, శివరాజ్ సింగ్ చౌహాన్ అభివృద్ధి పనులు కారణమని పేర్కొంది. నవంబర్ 17న జరిగిన ఈ రాష్ట్ర ఎన్నికల్లో 77.15 శాతం ఓటింగ్ శాతం నమోదైంది.

Exit mobile version