NTV Telugu Site icon

Kunal Kamra: మధ్యప్రదేశ్‌లో కునాల్ కమ్రా పోస్టర్లు కలకలం.. శివసేన పేరుతో వార్నింగ్‌

Kunalkamra6

Kunalkamra6

స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా వ్యవహారం ఇప్పుడు మధ్యప్రదేశ్‌కు పాకింది. కునాల్ కమ్రాకు సంబంధించిన పోస్టర్లు పబ్లిక్ టాయిలెట్ వెలుపల ప్రత్యక్షమయ్యాయి. మధ్యప్రదేశ్‌లో పర్యటిస్తే.. ముఖానికి నలుపు రంగు పూసి వీధుల్లో ఊరేగిస్తామంటూ యువసేన అధ్యక్షుడు అనురాగ్ సోనార్‌ హెచ్చరించారు. శివసేన యువజన విభాగం కార్యకర్తలు.. కునాల్ కమ్రాను హెచ్చరిస్తూ నగరంలో పోస్టర్లు వేశారు.

ఇది కూడా చదవండి: Illicit affair: ఇంట్లో అద్దెకు ఉండే వ్యక్తితో భార్య అక్రమ సంబంధం.. సజీవంగా పాతిపెట్టిన భర్త..

కామెడీ పేరుతో కునాల్ కమ్రా ప్రజలకు చెడును అందిస్తున్నాడని శివసేన యువజన విభాగం కార్యకర్తలు ధ్వజమెత్తారు. అతడి చెడు మనస్తత్వానికి నిరసనగా.. అతడి చిత్రాన్ని పబ్లిక్ టాయిలెట్‌ వెలుపల ఉంచినట్లు అనురాగ్ సోనార్ పేర్కొన్నారు. కునాల్ కమ్రా మధ్యప్రదేశ్‌కు వస్తే శివసేన కార్యకర్తలు.. అతడి ముఖానికి నలుపు రంగు పూసి వీధుల్లో ఊరేగిస్తారంటూ వార్నింగ్ ఇచ్చారు.

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేను ఉద్దేశించి స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా అనుచిత వ్యాఖ్యలు చేశారు. శివసేనను చీల్చిన ‘ద్రోహి’ అంటూ వ్యా్ఖ్యానించారు. ఈ వ్యాఖ్యలే తీవ్ర దుమారం రేపాయి. అనంతరం శివసేన కార్యకర్తలు.. కమ్రా కార్యక్రమం నిర్వహించిన క్లబ్‌పై దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఇరువర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదిలా ఉంటే తమిళనాడులో ఉన్న కునాల్ కమ్రాను ముంబై పోలీసులు సంప్రదించగా తన వ్యాఖ్యలను కునాల్ క్రమా సమర్థించుకున్నారు. క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఒకవేళ కోర్టులు అడిగితే మాత్రం క్షమాపణ చెబుతానని పేర్కొన్నారు. ఇక ప్రత్యర్థులు సుపారీ ఇచ్చి మాట్లాడిచ్చారంటూ వచ్చిన ఆరోపణలను కునాల్ ఖండించారు.

ఇది కూడా చదవండి: Minister Komatireddy: ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం.. కేసీఆరే కాదు, ఎవరు సలహాలిచ్చిన స్వీకరిస్తాం..