Site icon NTV Telugu

Sanjay Raut: పహల్గామ్ ఉగ్రవాదులు బీజేపీలో చేరొచ్చు.. అందుకే పట్టుకోవడం లేదు

Sanjayraut

Sanjayraut

ఆపరేషన్ సిందూర్‌పై శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ విమర్శలు గుప్పించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంపై ధ్వజమెత్తారు. ఆపరేషన్ సిందూర్‌ను బీజేపీ రాజకీయం చేస్తోందని.. త్రివిధ దళాలు నిర్వహించిన సైనిక ఆపరేషన్‌ను కమలనాథులు క్రెడిట్ తీసుకుంటున్నారని ఆరోపించారు. ప్రస్తుతంలో పహల్గామ్‌లో కాల్పులకు పాల్పడ్డ ఆరుగురు ఉగ్రవాదులు పరారీలో ఉన్నారని.. వారంతా బీజేపీలో చేరే అవకాశం ఉందని.. అందుకే వారిని పట్టుకోవడం లేదని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: Kishan Reddy: కవిత ఎపిసోడ్‌పై స్పందించొద్దు.. బీజేపీ నేతలకు కిషన్‌రెడ్డి కీలక సూచనలు..!

ఆపరేషన్ సిందూర్‌ను రాజకీయంగా వాడుకోవడానికి ప్రధాని మోడీ ప్రతి రాష్ట్రానికి వెళ్లి క్రెడిట్ తీసుకుంటున్నారని.. మన సైనికులు చేసిన దాన్ని మోడీ క్రెడిట్ తీసుకోవడమేంటి? అని ప్రశ్నించారు. రాహుల్‌గాంధీ నాయకత్వంలో ప్రత్యేక సమావేశం కోసం అందరి సంతకంతో కూడిన లేఖను పంపించినట్లు చెప్పారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను పెట్టాలని అడిగినా పెట్టలేదన్నారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని.. దానికి ప్రధాని మోడీ అధ్యక్షత వహించాలని అడిగితే.. దానికి రక్షణమంత్రి అధ్యక్షత వహించారన్నారు. ఇక ప్రత్యేక సమావేశాలు పెట్టాలని మల్లిఖార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖలు రాసినా కేంద్రం ముందుకు రాలేదని సంజయ్ రౌత్ ఆరోపించారు. ఇప్పుడేమో ఆపరేషన్ సిందూర్‌ను రాజకీయంగా వాడుకునేందుకు మాత్రం ప్రధాని మోడీ ప్రతి రాష్ట్రం తిరుగుతున్నారని సంజయ్ రౌత్ ఎద్దేవా చేశారు.

ఇది కూడా చదవండి: Government Survey: జనాభా పెరుగుదల.. ప్రభుత్వం ప్రత్యేక సర్వే..

ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్ర దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో భారత ప్రభుత్వం.. పాకిస్థాన్‌పై కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాలు నిలిపేసింది. వీసాలను రద్దు చేసింది. అలాగే అటారీ సరిహద్దు నిలిపేసింది. ఇక మే 7న పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దాదాపు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అంతేకాకుండా పాకిస్థాన్ వైమానిక స్థావరాలు దెబ్బతిన్నాయి.

 

Exit mobile version