NTV Telugu Site icon

Mumbai: కర్ణాటకలోని బెలగావిని యూటీ చేయండి.. మోడీకి ఆదిత్య థాక్రే విజ్ఞప్తి

Aadityathackeray

Aadityathackeray

కర్ణాటకలోని బెలగావిని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని శివసేన(యూబీటీ) నేత, ఎమ్మెల్యే ఆదిత్య థాక్రే డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ప్రధాని మోడీని కోరారు. బెలగావిలో మరాఠా మాట్లాడే ప్రజలకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. మరాఠీలకు జరుగుతున్న అవమానాన్ని సహించలేపోతున్నామన్నారు. బెలగావిలో అధిక జనాభా మరాఠీ మాట్లాడే వారే ఉన్నారని గుర్తుచేశారు. ఈ విషయంపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునే వరకు బెలగావిని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని ఆదిత్య కోరారు.

ఇది కూడా చదవండి: AP Cabinet: త్వరలో ఏపీ మంత్రివర్గంలోకి నాగబాబు!

ఇక కర్ణాటక ప్రభుత్వం తీరుపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ శిండే అసంతృప్తి వ్యక్తం చేశారు. బెలగావిలో నిరసనలు తెలుపుతున్న మరాఠీ కార్యకర్తలపై పోలీసుల్ని ప్రయోగించడాన్ని ఖండించారు. సరిహద్దులో మరాఠా మాట్లాడుతున్న ప్రజలపై కర్ణాటక ప్రభుత్వం అణచివేత వ్యూహాలను అనుసరిస్తోందని మండిపడ్డారు. ఇరు రాష్ట్రాల మధ్య ఎప్పటినుంచో ఉన్న సరిహద్దు వివాదాన్ని పరిష్కరించేందుకు అమిత్‌ షాతో గతంలో సమావేశం జరిగిందని గుర్తుచేశారు. సమావేశంలో సానుకూలంగా చర్చలు జరిగాయన్నారు. అయినా కూడా కర్ణాటక ప్రభుత్వం ఈ తరహాగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. సోమవారం ఉదయం కర్ణాటకలోని సువర్ణ విధాన్‌ సౌధలో జరిగిన అసెంబ్లీ సమావేశాలను వ్యతిరేకిస్తూ మహారాష్ట్ర ఏకీకరణ్‌ సమితి కార్యకర్తలు, నేతలను ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఇది కూడా చదవండి: Andhra Pradesh: టీడీపీ రాజ్యసభ సభ్యులు ఖరారు