Site icon NTV Telugu

Maharashtra Crisis : మండుతున్న ‘మహా’ రాజకీయం.. నువ్వే నేనా అన్నట్లు థాక్రే, షిండే భేటీలు..

Thackeray Shinde

Thackeray Shinde

మహారాష్ట్రలో రాజ‌కీయ సంక్షోభం అగ్గిరాచుకుంటోంది. ఒక‌రినొక‌రు పోటాపోటీగా స‌మావేశాల‌కు ఏర్ప‌టు చేస్తుకుంటున్నారు. శ‌నివారం పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమాశానికి ఇటు శివసేన సుప్రీం, ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే పిలుపు నిచ్చిన విష‌యం తెలిసిందే. అయితే దీనికి పోటీగా శివసేన రెబల్ నేత ఏక్‌నాథ్ షిండే మద్దతుగా నిలిచిన త‌మ ఎమ్మెల్యేలతో సమావేశానికి పిలుపునిచ్చారు. దీంతో పోటాపోటీ స‌మావేశాల‌తో వాతావ‌ర‌ణం ఒక్క సారిగా వేడెక్కింది.

అయితే వ‌ర్చువ‌ల్ మీట్ లో ద్వారా సీఎం మాట్లాడ‌నున్న విష‌యం తెలిసిందే. అయితే మధ్యాహ్నం 2 గంటలకు అసోంలో గౌమ‌తి హోట‌ల్ లో రెబ‌ల్ ఎమ్మెల్యేల‌తో ఏక్‌నాథ్ షిండే స‌మావేశానికి సిద్ద‌మ‌య్యారు. ఈ స‌మాచారాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు మీడియాకు ఇచ్చేందుకు ఒక గ్రూప్ ను సిద్దం చేసిన‌ట్లు స‌మాచారం. ఈ స‌మావేశంలో రెబల్ ఎమ్మెల్యేల భ‌విష్య‌త్ పై చ‌ర్చించ‌నున్నారు. అయితే జాతీయ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో.. శివసేన రెబల్ ఎమ్మెల్యేల విషయంలో ఆ పార్టీ ఒక నిర్ణయం తీసుకునే అకాశం ఉందని తెలుస్తోంది.

ఈ చ‌ర్చ‌లో సభ్యత్వం రద్దుపై.. 16 మంది రెబల్ ఎమ్మెల్యేలకు అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ నరహరి జైర్వాల్ నోటీసులు జారీ చేసే అవ‌కాశం ఉందని విశ్వ‌నీయ స‌మాచారం. కాగా.. ఈ సస్పెన్షన్‌పై సవాలు చేసేందుకు షిండే సైతం లీగల్ బృందాన్ని సిద్ధం చేసుకుంటున్నార‌ని అందుకే ఈ స‌మావేశం ఏర్పాటు చేశార‌ని తెలుస్తోంది. ఒక‌వేల ఇలాంటి పరిస్థితులే ఏదైనా తలెత్తితే .. తెరవెనుక నుంచి షిండే వర్గానికి బీజీపీ మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయని స‌మాచారం. అయితే.. రెబల్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తే మహారాష్ట్రలో తలెత్తిన రాజకీయ డ్రామా మరికొంత కాలం కొనసాగే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు రాజకీయ పండితులు. ఏది ఏమైనా శ‌నివారం పోటాపోటీ స‌మావేశాల‌తో మ‌హారాష్ట్ర ద‌ద్ద‌రిల్లుతుంద‌నే చెప్పొచ్చు.

India Corona: దూసుకొస్తున్న ఫోర్త్ వేవ్!.. దేశంలో 15వేలకు పైగా కేసులు

Exit mobile version