NTV Telugu Site icon

Sheikh hasina: ఢిల్లీ నుంచి లండన్‌కు వెళ్లనున్న షేక్ హసీనా

Sheikhhasina

Sheikhhasina

బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేసి ఢిల్లీ చేరుకున్న షేక్ హసీనా.. లండన్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. సోమవారం సాయంత్రం 5:30కి హసీనా ఢిల్లీ చేరుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్‌లోని హిండన్ ఎయిర్‌బేస్‌లో దిగారు. అక్కడ ఆర్మీ అధికారులు స్వాగతం పలికారు. ఇక ఢిల్లీ చేరుకున్న హసీనాతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ భేటీ అయ్యారు. ఢాకాలో ప్రస్తుత పరిస్థితిపై చర్చించారు. ఢిల్లీ నుంచి హసీనా లండన్‌కు వెళ్లిపోనున్నట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: AP CM Chandrababu: పుట్టపర్తి సత్య సాయి ట్రస్ట్ విషయంలో సీఎం కీలక కామెంట్లు

బంగ్లాదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆందోళనలు, నిరసనలతో రక్తసిక్తమైంది. గత నెల నుంచి జరుగుతున్న కోటా ఉద్యమం ఆగస్టులో మరింత తీవ్ర రూపం దాల్చి తీవ్ర హింసకు దారి తీసింది. ఇప్పటి వరకు 300 మంది ప్రాణాలు కోల్పోగా.. గత ఆదివారమే దాదాపు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారంటే పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. వందలాది మంది రోడ్లపైకి వచ్చి నిరసనల్లో పాల్గొన్నారు. ఈ ఆందోళనల్లో పిల్లలతో పాటు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలంటూ ఆదివారం వేలాది మంది రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. దీంతో పోలీసులు టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు. దీంతో వంద మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయాలు పాలయ్యారు. ఇదిలా ఉంటే ఉద్యమం తీవ్ర రూపం దాల్చడంతో ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేశారు.

ఇది కూడా చదవండి: Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్ ఎలా పనిచేస్తాయో తెలుసా.?