Shashi Tharoor: 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అతపెద్ద పార్టీగా అవతరిస్తుందని ఆయన జోస్యం చెప్పారు. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మాత్రం తగిన సంఖ్యకు దూరంగా ఉంటుందని, ఎన్డీయే మిత్రపక్షాలు బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు నిరాకరించే అవకాశం ఉందని, దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని నిరోధించవచ్చని అన్నారు.
2019 ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 303 సీట్లు గెలుచుకుంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అద్భుతంగా 400 మార్కులు సాధించాలని కూటమి లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ సారి మాత్రం కాంగ్రెస్, ఆర్జేడీ, ఆప్, జేడీయూ, టీఎంసీ, డీఎంకే వంటి పార్టీలతో సహా 27 పార్టీలు ఇండియా కూటమిని ఏర్పాటు చేసుకుని బీజేపీకి అధికారం దక్కకుండా వ్యూహాలను రచిస్తున్నాయి.
కేరళ లిటరేచర్ ఫెస్టివల్‌లో థరూర్ మాట్లాడుతూ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా ఆపడానికి బిజెపి సంఖ్యను తగ్గించవచ్చని అన్నారు. ‘‘2024 ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని నేను నమ్ముతున్నాను. అయితే వారి సంఖ్యాబలం తక్కుతుందని.. వారి మిత్రపక్షాలు పొత్తుకు ఇష్టపడని స్థాయికి చేరుతుందని నమ్ముతున్నాను. వారు మాతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉంటారు. కాబట్టి మనం ఒకసారి ప్రయత్నించాలి’’ అని మాజీ కేంద్ర మంత్రి థరూర్ అన్నారు.
Read Also: IND vs AFG: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. రెండు మార్పులతో బరిలోకి
పలు రాష్ట్రాల్లో ఇండియా కూటమి సీట్లు పంచుకునే ఒప్పందాలను చేసుకుంటే.. ఓటములను అడ్డుకోవచ్చని.. ఒకవేళ సీట్ల పంపకాలపై భిన్నాభిప్రాయాలు ఉంటే బీజేపీ అభ్యర్థి గెలుస్తారని అన్నారు. కేరళలో సీపీఎం, కాంగ్రెస్‌లు సీట్ల పంపకాల ఒప్పందాన్ని అంగీకరించడం అసాధ్యమని థరూర్ అన్నారు. కేరళలో ఈ రెండు పార్టీలు ప్రత్యర్థులుగా ఉన్నాయి, ఇటి సీట్ల పంపకానికి అంగీకరిస్తారనేది దాదాపుగా అసాధ్యం, కానీ తమిళనాడులో సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, డీఎంకే అన్నీ కలిసి మిత్రపక్షంగా ఉన్నాయి. అక్కడ ఎలాంటి వివాదాలు లేవు.
ఇండియా కూటమిలో సీట్ల పంపకాలు కొలిక్కి రావడం లేదు. కాంగ్రెస్‌తో కొన్ని రాష్ట్రాల్లో కూటమిలోని కొన్ని పార్టీలు సీట్ల షేరింగ్‌కి ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. బెంగాల్‌లో బీజేపీని ఓడించేది టీఎంసీనే అని సీఎం మమతా బెనర్జీ చెబుతోంది. ఇక పంజాబ్, ఢిల్లీల్లో ఆప్, కాంగ్రెస్ ప్రత్యర్థులుగా ఉన్నాయి.