NTV Telugu Site icon

Shashi Tharoor: కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో శశిథరూర్ సెల్ఫీ.. హస్తానికి బై చెప్పినట్టేనా..!

Shashitharoor

Shashitharoor

కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్.. హస్తానికి గుడ్‌బై చెప్పే సూచనలు కనిపిస్తున్నాయి. త్వరలోనే ఆయన కాషాయ కండువా కప్పుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి తన అవసరం లేకపోతే చెప్పాలని.. తన ముందు చాలా ఆఫర్లు ఉన్నాయని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆ దిశగానే ఆయన అడుగులు పడుతున్నాయి. తాజాగా కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో దిగిన ఫొటోను శశిథరూర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. భారత్-యూకే మధ్య వాణిజ్య ఒప్పందం మెరుగుపడడం శుభపరిణామం అంటూ పేర్కొన్నారు. ఈ సందర్భంగా బ్రిటిష్ విదేశాంగ కార్యదర్శి జోనాథన్ రేనాల్డ్స్‌, కేంద్రమంత్రి గోయల్‌తో దిగిన ఫొటోను పంచుకున్నారు. ఈ ఫొటో తర్వాత శశిథరూర్ కాంగ్రెస్‌ను వీడడం ఖాయమని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల మోడీ అమెరికా పర్యటనలో ఉండగా ట్రంప్‌తో భేటీని కొనియడారు. అలాగే కేరళలో సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్ ప్రభుత్వ విధానాలను ప్రశంసించారు. దీంతో ఆయన బీజేపీకి దగ్గరవుతున్నారని సంకేతాలు ఇచ్చారు. తాజా పరిణామం మరింత బలపడుతోంది.

ఇది కూడా చదవండి: YSRCP vs Janasena: ఒంగోలులో వైసీపీకి బిగ్‌ షాక్.. ఏకంగా 20 మంది కార్పొరేటర్లు జనసేన వైపు..

‘‘పార్టీ నన్ను కోరుకుంటే నేను పార్టీకి అందుబాటులో ఉంటాను. లేకపోతే నాకు సొంత పనులు ఉన్నాయి. నాకు సమయం గడపడానికి వేరే మార్గం లేదని మీరు అనుకోకూడదు. నాకు వేరే ఆప్షన్స్ ఉన్నాయి. నా దగ్గర నా పుస్తకాలు, ప్రసంగాలు, ప్రపంచవ్యాప్తంగా చర్చల కోసం ఆహ్వానాలు ఉన్నాయి’’ అని శశిథరూర్ చెప్పడం సంచలనంగా మారింది.

ఈ వ్యాఖ్యలతో నేరుగా కాంగ్రెస్ పార్టీకి అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు కేరళలోని లెఫ్ట్ ప్రభుత్వాన్ని ప్రశంసించడం కూడా సంచలనంగా మారింది. కేరళలో కాంగ్రెస్ కూటమి, లెఫ్ట్ కూటమి ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నాయి. తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నుంచి ప్రశంసలు రావడాన్ని పినరయి విజయన్ సర్కార్ స్వాగతించింది. ఇదే కాకుండా ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని మోడీ భేటీని కూడా ఆయన ప్రశంసించడం కూడా విమర్శలకు దారి తీసింది.

ఇది కూడా చదవండి: Kerala: సైకోగా మారిన యువకుడు.. ప్రియురాలి సహా కుటుంబాన్ని చంపిన దుర్మార్గుడు

2024 జాతీయ ఎన్నికల్లో కాంగ్రెస్ కాస్త పుంజుకున్నప్పటికీ, తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో విఫలమైంది. దీనిని ఉద్దేశిస్తూ, కాంగ్రెస్ తన ప్రాబల్యాన్ని విస్తరించుకోవాల్సిన అవసరం ఉందని, లేకుంటే మూడోసారి ప్రతిపక్షంలో కూర్చుంటాని శశిథరూర్ హెచ్చరించారు. కాంగ్రెస్ మద్దతుదారులు మద్దతుతో మాత్రమే గెలవలేమని అన్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కి 19 శాతం ఓట్లు మాత్రమే ఉన్నాయి, వీటితో అధికారం సాధించలేమని, 25-27 శాతం అదనంగా వస్తేనే కాంగ్రెస్ అధికారంలోకి రాగలదని అన్నారు. తాను వ్యక్తపరిచిన తీరు వల్లే కాంగ్రెస్‌ని వ్యతిరేకించే వారి ఓట్లు కూడా తనకు వచ్చాయని చెప్పారు.