కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్.. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. పార్టీ అధ్యక్షుడినైతే ఏం చేస్తాననే విషయంపై మేనిఫెస్టో తయారు చేసి విడుదల చేశారు.. పార్టీలో మేమందరం ఒక్కటేనని, తమకు సిద్ధాంత వైరుధ్యాలు లేవని స్పష్టం చేసిన ఆయన.. బీజేపీని ఎలా ఎదుర్కోవాలనే అంశంపైనే తమ చర్చ అన్నారు. అధ్యక్ష ఎన్నికపై కాంగ్రెస్ ఫ్యామిలీలో అంతర్గత చర్చ జరుగుతోందన్నారు. హైదరబాద్‌లో కొందరిని సపరేట్.. సపరేట్‌గా కలవబోతున్నానని పేర్కొన్నారు.. ఈ నెల 16 వరకు ఎన్నికల ప్రచారం చేసుకునే అవకాశం ఉండగా.. 17న అధ్యక్ష ఎన్నిక జరగనుంది.. అన్ని పీసీసీలను కలవాలని వచ్చాను.. ఎన్నికలు అనేవి కుటుంబం లోని అంతర్గత అంశం లాంటివి అన్నారు..
Read Also: Errabelli Dayakar Rao: ఢిల్లీలో అభినందనలు.. గల్లీల్లో బీజేపీ నేతల పిచ్చిపిచ్చి కామెంట్లు..!
ఇక, తనకు చాలా మంది మద్దతిస్తున్నారు.. ఫోన్లు చేసి మద్దతు తెలుపుతున్నారని వెల్లడించారు శశిథరూర్.. కాంగ్రెస్ పార్టీ ఫండమెంటల్ విషయాల్లో తనది, ఖర్గేది ఒకే స్టాండ్ అని స్పష్టం చేసిన ఆయన.. కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో ఎవరు శక్తి మంతులు అనేదే ప్రధాన ప్రశ్న అన్నారు. తాను ఇటీవలే మల్లికార్జున ఖర్గేతో మాట్లాడానని, ఆయన ఒక గొప్ప నేతని, ఆయనతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. మరోవైపు, తెలంగాణ నాయకులతో తనకు మంచి సంబంధాలున్నాయని, కాంగ్రెస్‌లో జీ 23 అనేదే లేదని వ్యాఖ్యానించారు థరూర్.. నేను ఖర్గే అంటే ఎంతో గౌరవిస్తా.. జెంటిల్ మెన్ ఆతను.. మేం మంచి మిత్రులం అన్నారు.. కానీ, అధికారిక అభ్యర్ది అని లేదని స్పష్టం చేశారు.. అలాంటి గ్రూప్ లేదు.. ఎన్నికలు అనేవి కాంగ్రెస్ అంతర్గత బలోపేతం కోసమే.. 2024 ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి ఎలాంటి వ్యూహం చేయాలనేది ముఖ్యమైన అంశం అన్నారు.. హైదరాబాద్ వచ్చా.. చెన్నై, ముంబై, కోల్‌కతా కూడా వెళ్తానని వెల్లడించారు.. పీసీసీ నన్ను పిలిచారు, ఇంటికి రమ్మని చెప్పారు.. అనుకోకుండా వారి బంధువులు చనిపోయారు అని చెప్పారని.. అందుకే కలవలేక పోయానని వెల్లడించారు.. తన విజన్ తనకుందని, ఖర్గే విజన్ ఆయనకుందని శశిథరూర్ అన్నారు. పార్టీ నాయకత్వాన్ని సెంట్రలైజేషన్ చేయాల్సి ఉందన్నారు శశిథరూర్.