NTV Telugu Site icon

Maharashtra: సీఎం ఏక్‌నాథ్ షిండేతో శరద్‌పవార్ భేటీ.. దేనికోసమంటే..!

Sharadpawareknathshinde

Sharadpawareknathshinde

త్వరలోనే మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అన్ని పార్టీలు గెలుపు కోసం సంసిద్ధం అవుతున్నాయి. అధికార పార్టీ మరోసారి అధికారం కోసం ప్రయత్నిస్తుంటే.. ఇండియా కూటమి కూడా అధికారం కోసం కసరత్తు ప్రారంభించింది. ఈసారి రెండు కూటమిల మధ్య తీవ్రపోటీ నెలకొననుంది. ఇదిలా ఉంటే మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్, మహారాష్ట్ర నవనిర్మాణ్ సే చీఫ్ రాజ్‌థాకరేలు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను శనివారం వేర్వేరుగా కలిశారు.

ఇది కూడా చదవండి: Madhyapradesh : స్కూల్ నుంచి తిరిగి వస్తుండగా చిన్నారులపై పడిన గోడ నలుగురు మృతి

సీఎంవో కార్యాలయం సమాచారం ప్రకారం.. ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో షిండేను శరద్ పవార్ కలిశారు. మరాఠా రిజర్వేషన్లు మరియు ఇతర రాజకీయ చర్చలపై ఇరువురి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వీరి భేటీ ఆసక్తిగా మారింది.

ఇది కూడా చదవండి: ED Raids: బంజారాహిల్స్లోని హీరా గ్రూప్లో ముగిసిన ఈడీ సోదాలు..