Site icon NTV Telugu

Sharad Pawar: ఎన్సీపీ సంక్షోభం.. శరద్ పవార్ వర్గం సూచించిన కొత్త పేర్లు, ఎన్నిక చిహ్నాలు ఇవే..

Ncp

Ncp

Sharad Pawar:నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) సంక్షోభం నేపథ్యంలో మంగళవారం ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. నిజమైన ఎన్సీపీ అజిత్ పవార్‌దే అని ప్రకటించి శరద్ పవార్‌కి షాక్ ఇచ్చింది. అజిత్ పవార్ వర్గంలోనే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉండటంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే, రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం శరద్ పవార్ వర్గం కొత్త పేర్లు, ఎన్నికల గుర్తులను సూచించాలని కోరింది.

Read Also: BJP vs Congress: ఢిల్లీ వేదికగా హీటెక్కిన కర్ణాటక రాజకీయం

ఈ నేపథ్యంలో శరద్ పవార్ వర్గం మూడు పేర్లు, ఎన్నికల గుర్తులను సూచించినట్లు తెలుస్తోంది. ‘శరద్ పవార్ కాంగ్రెస్’, ‘మి రాష్ట్రవాది’, ‘శరద్ స్వాభిమాని’ అనే మూడు పేర్లతో పాటు ‘టీ కప్పు’, ‘సన్ ఫ్లవర్‘, ‘ఉదయించే సూర్యుడు’ గుర్తులను ఈసీకి ప్రతిపాదించినట్లు సమాచారం. నిజమైన ఎన్సీపీ అజిత్ పవార్‌దే అని ఈసీ ప్రకటించి, ఎన్నికల చిహ్నం ‘గడియారం’ని అజిత్ పవార్ వర్గానికే కేటాయించింది.

ఈసీ నిర్ణయంపై అజిత్ పవార్ వర్గం సంబరాలు చేసుకుంటే.. శరద్ పవార్ వర్గం ఈ నిర్ణయాన్ని ‘‘ ప్రజాస్వామ్య హత్య’’ అభివర్ణించింది. గతేడాది అజిత్ పవార్ ఎన్సీపీలో చీలక తీసుకువచ్చారు. ఆ తర్వాత శివసేన-బీజేపీ ప్రభుత్వంలో చేరారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం పదవిని అజిత్ పవార్ తీసుకున్నారు. పలువురు ఎన్సీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కాయి.

Exit mobile version